National News

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన టూర్ కొనసాగుతోంది. మూడు రోజులుగా ఆయన అక్కడ మకాం వేసిన సంగతి తెలిసిందే. విభజన సమయంలో ఇచ్చిన హామీలు..పెండింగ్ లో ఉన్న కేంద్ర నిధులు..ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని ఆయన కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. సోమవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులపై కేసీఆర్ చర్చించారు. అనుమతులిచ్చిన రహదారులకు వెంటనే అలైన్ మెంట్లు, నోటిఫికేషన్ లు త్వరగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నేషనల్ హైవేలన్నింటినీ గ్రీన్ హైవేలుగా మార్చాలని గడ్కరిని కోరారు. 

ముంబై : రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం చంద్రబాబు.. అనంతరం గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. అమరావతిని వరల్డ్‌ క్లాస్ సిటీగా తయారు చేయబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన అన్నీ సౌకర్యాలు అమరావతిలో ఉన్నాయని.. పరిశ్రమలు స్థాపించి అమరావతి అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు పారిశ్రామికవేత్తలను కోరారు. 

 

ఢిల్లీ : ఆసియా గేమ్స్‌లో పివీ సింధు చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పైనల్స్‌కు చేరి రికార్డ్‌ నెలకొల్పింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్రను సృష్టించింది. సెమిస్‌లో జపాన్‌ ప్లేయర్‌ యమగుచిపై విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

 

ఢిల్లీ : రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ప్రారంభం అయింది. పార్టీల ఎన్నికల ఖర్చుపై పరిమితి, ఓటర్ల నమోదు యంత్రాంగం ఏర్పాటు, పార్టీ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు అంశాలపై అభిప్రాయాన్ని ఈసీ సేకరిస్తుంది. టీడీపీ తరపున కనమేడల రవీంద్ర కుమార్, రావులు చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి ఎంపి వినోద్, సీపీఐ తరపున నారాయణ, బీజేపీ నుంచి జేపీ నడ్డా, భూపేంద్రయాదవ్ లు హాజరయ్యారు. 

 

ముంబై : బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ ఈ)లో అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. అమరావతి బాండ్ల 2018 లిస్టింగ్ ను సీఎం చంద్రబాబు సెరిమోనియల్ బెల్ మోగించి ప్రారంభించారు. జీఎస్ ఈ సీఈవో, ఎండీ అశిష్ కుమార్ తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి నిధుల కోసం జీఎస్ ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం నిర్వహించారు. పెట్టుబడుల కోసం ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సీఎం భేటీ కానున్నారు. 

 

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత్‌ మరో రెండు రజత పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల, మహిళల రన్నింగ్‌ రేసులో ఈ పతకాలు దక్కాయి. పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో భారత స్ప్రింటర్‌ మహ్మద్‌ అనాస్‌ సత్తా చాటాడు. 45.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని సాధించాడు. మహిళల 400 మీటర్ల రన్నింగ్‌ రేసులో హిమదాస్‌ రజతం కైవసం చేసుకుంది. 50.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకం సాధించింది. ఇక భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులు భారత్‌కు మరో రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లోకి తొలిసారి అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. ఆసియా క్వార్టర్స్‌లో సింధు థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి జిందాపోల్‌పై విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. మరో క్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ క్రీడాకారిణి, థాయ్‌లాండ్‌కు చెందిన రట్చనాక్‌పై సైనా నెహ్వాల్‌ గెలిచి పతకాన్ని ఖాయం చేసింది. 

 

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి 7 జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం అందింది. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది.  అయితే వచ్చే ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ వినియోగానికి విపక్షాలు పట్టుబట్టనున్నాయి. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితత్వం, పారదర్శకత, ఓటర్ల నమోదులాంటి అంశాలైనా చర్చ జరుగనుంది.ఈ మీటింగ్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్‌ఎస్‌, టీడీపీ నుంచి నేతలు హాజరవుతున్నారు. ఎన్నికల సంస్కరణలకు తమ పార్టీ సానుకూలంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. 

 

ఢిల్లీ : మంత్రివర్గ సిఫారసు ప్రకారం అసెంబ్లీ రద్దైనా ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషనేనని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ చెప్పారు. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. 
 

ఢిల్లీ : ముంబై స్టాక్ ఎక్చ్సేంజ్ నిర్వహించే 'అమరావతి బాండ్ల లిస్టింగ్' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈమేరకు ఆయన ముంబై బయలుదేరారు. సోమవారం ఉదయం 9గంటలకు జరిగే ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో బాబు భేటీ కానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ భేటీలు జరుగనున్నాయి. రతన్ టాటా, ముఖేష్ అంబానీతో పాటు పలువురితో బాబు సమావేశం కానున్నారు. 

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఏడు జాతీయ 51 ప్రాంతీయ పార్టీలతో ఈసీ భేటీ కానుంది. రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది. ఈ సమావేశానికి టిడిపి నుండి కనమేడల రవీంద్ర కుమార్ హాజరు కానున్నారు. ఈవీఎంలకు వీవీ పాట్ లను తప్పనసరి చేయాలని టిడిపి కోరనుంది. 

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని 9,10 షెడ్యూలు సంస్థల విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కోరారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను కూడా పూర్తిగా తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన భేటీలో కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో జరిపిన సమావేశంలో స్వయం సహాయ బృందాలకు వడ్డీ రాయితీ బకాయిల విడుదల, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాలపై కేసీఆర్‌ చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మూడు రోజుల హస్తిన టూర్‌లో భాగంగా శనివారం మొదటి రోజు ప్రధాని మోదీతో భేటీ అయిన కేసీఆర్‌.. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు, విభజన హామీలు, కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం వంటి అంశాలపై చర్చించారు. ఆదివారం రెండో రోజు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీతో సమావేశమైన కేసీఆర్‌... హైకోర్టు విభజన, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై చర్చించారు. రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు, వినోద్‌, బూర నర్సయ్యగౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వివేక్‌ పాల్గొన్నారు. కాగా అరుణ్‌ జైట్లీతో జరిపిన సమావేశంలో కేసీఆర్‌ ఏకాంతంగా చర్చలు జరిపారు. 

రాజ్‌నాథ్‌సింగ్‌తో కేసీఆర్‌ జరిపిన భేటీలో విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. 9,10 షెడ్యూలు సంస్థల విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణకు కేటాయింపు, హైకోర్టు విభజన వంటి అంశాలను చర్చించారు. అరుణ్‌ జైట్లీతో జరిపిన భేటీలో తెలంగాణలోని 4 లక్షల స్వయం సహాయ సంఘాలకు కేంద్రం నుంచి రావాల్సిన 399 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ, తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచితే రాష్ట్రానికి అదనంగా రుణాలు వస్తాయని జైట్లీ దృష్టికి తెచ్చారు. సోమవారం మూడో రోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కేసీఆర్‌ సమావేశం అవుతారు. రాష్ట్రాలోని కొత్త జాతీయ రహదారులకు అనుమతి, మౌలికసదుపాయాలకు నిధులు, సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై చర్చిస్తారు. 

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది. 

ఢిల్లీ : తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్డు సంస్థల విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కేసీఆర్‌ కోరారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను కూడా పూర్తిగా తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన భేటీ కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో జరిపిన సమావేశంలో స్వయం సహాయ బృందాలకు వడ్డీ రాయితీ బకాయిల విడుదల, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాలపై కేసీఆర్‌ చర్చించారు.  

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన టూర్ కొనసాగుతోంది. ఆయన శనివారం ఢిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు...నూతన జోనల్...విభజన చట్టం హామీలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన నిధులు..ఇతరత్రా వాటిపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న అంశాలను పూర్తి చేయాలని..రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులను మంజూరు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తులు చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో కూడా కేసీఆర్ సమావేశం కానున్నారు. 

ఢిల్లీ : రెండోరోజు ఢిల్లీలో కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్‌ను, 4.30 గంటలకు అరుణ్‌జైట్లీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలు త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్‌ కేంద్ర మంత్రులను కేసీఆర్‌ కోరనున్నారు. 

 

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి మరో రెండు రోజులపాటు హస్తినలోనే ఉండనున్నారు. ఇవాళ ఆయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అవుతారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆయనను కోరనున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై ఆయనతో చర్చించనున్నారు. అరుణ్‌జైట్లీతోపాటు అపాయింట్‌మెంట్‌ దొరికితే మరికొంత మంది కేంద్రమంత్రులతో కేసీఆర్‌ భేటీ అవుతారు.

 

ఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 9 మంది సభ్యులతో కూడిన కోర్‌ కమిటీని నియమించారు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, పి. చిదంబరం, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, జైరాం రమేష్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కోర్‌ కమిటీతో పాటు మరో రెండు కమిటీలను రాహుల్‌ ఏర్పాటు చేశారు. పార్టీ మ్యానిఫెస్టోను ఆకర్షణీయంగా రూపొందించేందుకు 19 మంది సభ్యులతో ఓ కమిటి వేశారు. ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ కోసం 13 మంది సభ్యులతో కూడిన మరో పబ్లిసిటీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 

 

ఢిల్లీ : అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ కుంతియా డిమాండ్‌ చేశారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌... ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తాందా.. అని కుంతియా ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలతో వచ్చే నెల నుంచి నాలుగైదు నెలలపాటు తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌దే తెలుపని కుంతియా ధీమా వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ర్టానికి సంబంధించిన 14 అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు..కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, బీసీ రిజర్వేషన్ బిల్లుపైతో పాటు రక్షణ శాఖ భూములు రాష్ర్టానికి బదలాయించాలని కోరినట్లు సమాచారం. అలాగే రాష్ర్టానికి ఐఐఐటీ, ఐఐఎం మంజూరు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుపై మోదీతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. 

 

 

ఢిల్లీ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కేరళకు భారీ ఎత్తున సామాగ్రిని పంపనుంది. యూఏఈ ప్రభుత్వ విమాన సంస్థ ఎమిరేట్స్ విమానంలో 175 టన్నుల సహాయ సామాగ్రిని తీసుకుని   కేరళకు బయలుదేరింది. కేరళకు యూఏఈ అండగా ఉంటుందని, 175 టన్నుల సామాగ్రిని తీసుకొస్తున్నామని ఎమిరేట్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. యూఏఈలోని ఎంతోమంది వ్యాపారవేత్తలు, ప్రజలు, సంస్థలు అందించిన సాయాన్ని విమానాల ద్వారా తిరువనంతపురానికి తరలిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బోట్లు, రగ్గులు, నిల్వ ఆహార పదార్థాలు, తదితర అత్యవసర వస్తువులను తరలిస్తున్నారు. యూఏఈలో పనిచేస్తున్న విదేశీయుల్లో 80 శాతం మంది కేరళ వాసులే ఉండడంతో వరద బాధితులను ఆదుకునేందుకు ఆ దేశం ముందుకు వచ్చింది.

అహ్మదాబాద్ : గుజరాత్‌లో పాటీదార్ రిజర్వేషన్ల పోరాట నేత హార్దిక్‌ పటేల్‌ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు, రైతులకు రుణమాఫీ ప్రకటించాలని కోరుతూ హార్దిక్‌ పటేల్‌ తన ఇంట్లోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. జునాగఢ్‌లో 144వ సెక్షన్‌ విధించింది. ఇంతకు ముందు అహ్మదాబాద్‌, గాంధీనగర్‌లో హార్దిక్‌ పటేల్‌ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతించలేదు. తన నిరాహార దీక్షకు అనుమతించాలని కోరుతూ హార్దిక్ పటేల్‌ గుజరాత్‌ సిఎం విజయ్‌ రూపానికి లేఖ రాశారు.

 

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మరో మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే గడపనున్నారు. సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి, రక్షణశాఖ మంత్రిని కలవనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజన, రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు పలు పెండింగ్‌ అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. పెండింగ్‌ అంశాలను వెంటనే పూర్తి చేయాలని కేసీఆర్‌ కోరనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం

 

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మరో మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే గడపనున్నారు. సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి, రక్షణశాఖ మంత్రిని కలవనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజన, రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు పలు పెండింగ్‌ అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. పెండింగ్‌ అంశాలను వెంటనే పూర్తి చేయాలని కేసీఆర్‌ కోరనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

విశాఖపట్నం : వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం దేశ ఆహార భద్రతకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో రైతుల సాగును విడనాడి ఇతర వృత్తుల్లోకి వెళ్తుతున్నారి ఆవేదన వెలిబుచ్చారు. బాబా అణు పరిశోధనా కేంద్రం, హోమీ బాబా కేన్సర్‌ ఆస్పత్రి పరిశోధనా కేంద్రం విశాఖలో నిర్వహించిన సదస్సుకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు విస్తృతం చేయాలని కోరారు. 

జమ్ముకశ్మీర్‌ : అనంత్‌నాగ్‌లోని కొకేర్‌నాగ్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉదయం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కోకేర్‌నాగ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతాబలగాలు అర్ధరాత్రి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఆర్మీ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇరు వర్గాల మధ్య కాల్పుల నేపథ్యంలో అనంత్‌నాగ్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

కేరళ : వరదలతో అతలాకుతలమైన కేరళకు యూఏఈ 700 కోట్ల సహాయంపై చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశ రాయబారి అహమద్‌ అలబానా స్పందించారు. ఇప్పటివరకు అధికారికంగా ఎన్ని కోట్లు ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. దీనిపై తమ ప్రభుత్వం అంచనా వేస్తోందని అలబానా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహకారాన్ని తీసుకునేది లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కేరళలో సహాయక చర్యలు, పురరావాసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే సహకారం అందిస్తాయని విదేశాంగ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. కేరళకు సహాయం అందించేందుకు యూఏఈ 700 కోట్లు, కతార్‌ 35 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం యూఏఈ సహాయం స్వీకరించడానికి శ్రద్ధ చూపుతోంది. కేరళ ప్రజలు యూఏఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ఆ దేశ పాలకులు గుర్తించిన క్రమంలో యుఏఈని ఇతర దేశంగా పరిగణించలేమని చెబుతోంది. 

మధ్యప్రదేశ్‌ : రాష్ట్రంలో సిఎం పేరు చెప్పుకుని ఫ్యామిలితో ఉన్న ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. భోపాల్‌ అసెంబ్లీ ముందు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారును పోలీసులు ఆపారు. తాను ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ బావమర్దిని అంటు కారు డ్రైవర్‌ హంగామా సృష్టించాడు. తనకే జరిమానా విధిస్తారా...అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై స్పందించిన సిఎం- రాష్ట్రంలో తనకు కోట్లాది మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారని... వాళ్ల భర్తలంతా తనకు బావమర్దులే అంటూ నవ్వుతూ చెప్పారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని శివరాజ్‌సింగ్‌ తెలిపారు.

Pages

Don't Miss