National News

హైదరాబాద్ మహానగరం మరో భారీ ఎక్స్‌పోకి వేదిక కానుంది. ఆసియాలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పో హైదరాబాద్‌లో జరగనుంది. ఇండియాజాయ్-2018 పేరుతో హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ ఎక్ప్‌పో నిర్వహించనున్నారు. డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ఎక్ప్‌పో జరగనుంది. యానిమేషన్, గేమింగ్, డిజిటల్ మీడియా, వీఎఫ్ఎక్స్, కామిక్స్, సినిమా రంగాలకు సంబంధించి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ ఎక్ప్‌పో నూతన అధ్యయనం కానుందని నిర్వాహకులు తెలిపారు. సుమారు 25వేల మంది డెలిగేట్లు హాజరవుతారని.. టాలెంట్‌ను ప్రోత్సహించడానికి, నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం అని నిర్వాహకులు తెలిపారు. దీనికి హాజరయ్యే విద్యార్థులకు డిజిటల్, మీడియా కంటెంట్ గురించి అవగాహన కల్పిస్తామన్నారు. 30 దేశాల నుంచి నిపుణులు వస్తారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్ రంగాల పరిధి పెరుగుతోందని, ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, మిజోరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మద్యప్రదేశ్‌లో 230 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 65.5 శాతం ఓటింగ్ నమోదు కాగా మిజోరంలో 40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
కొన్ని చోట్ల ఈవీఎం యంత్రాలు మొరాయించగా... కొన్ని చోట్ల రాజకీయ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడిన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. మిజోరంలో మధ్యాహ్నం 3 గంటలకు 65 శాతం ఓట్లు నమోదుకాగా, మధ్యప్రదేశ్‌లో 2 గంటలకు కేవలం 34.99 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. 23 పోలింగ్ బూతుల్లో ఎవీఎంల పనిచేయకపోవడంతో పోలింగ్ అక్కడ ఆలస్యం అయ్యింది.
 

 

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువు అయిపోయింది. చిన్న, పెద్ద.. పేద, ధనిక అనే తేడా లేదు.. దాదాపు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరగనుందని గణాంకాలు చెబుతున్నాయి. భారత దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 142 కోట్లకు చేరనుందని, వీరిలో 4జీ కస్టమర్ల వాటా 80శాతంగా ఉండనుందని ఎరిక్‌సన్ మొబిలిటీ తన నివేదికలో అంచనా వేసింది.
ఆరేళ్లలో 100 కోట్లు:
ఎరిక్సన్ మొబిలిటీ ఇంకా పలు విస్తుపోయే విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 56 కోట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల సంఖ్య మరో ఆరేళ్లలో(2024) 100 కోట్లకు చేరుకోవచ్చని,  అలాగే నెలవారీగా సరాసరి డేటా సేవల వినియోగం 14శాతం వృద్ధి నమోదు చేసుకోనుందని తెలిపింది. 2018లో 6.8 జీబీ స్థాయి నుంచి 2024 నాటికి 15 జీబీకి చేరుకోవచ్చని అంచనా వేసింది. వచ్చే ఆరేళ్లలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఆధారిత స్మార్ట్‌ఫోన్లు 400 కోట్ల స్థాయిని అధిగమించవచ్చని అంచనా కట్టారు.
2022 నాటికి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వినియోగం పెరిగేందుకు రెండేళ్లు పట్టొచ్చని అంచనా వేశారు. 2024 నాటికి 5జీ కస్టమర్ల సంఖ్య 3.8 కోట్లుగా ఉండే అవకాశం ఉందని, మొత్తంగా అంచనా వేసిన కస్టమర్లలో వీరి వాటా కేవలం 2.7 శాతంగా ఉండనుందని నివేదికలో తెలిపింది. 5జీ సేవలతో మొబైల్‌ ద్వారా సెకనుకు ఒక గిగాబైట్‌ వేగంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేసే వీలుంటుందన్నారు.
5జీ యూజర్లు @ 150కోట్లు:
2024 ఆఖరు నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 150 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉంటారని ఎరిక్సన్‌ మొబిలిటీ పేర్కొంది. 5జీ వినియోగంలో ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయని తెలిపింది. 2024 నాటికి ప్రపంచవ్యాప్త 5జీ సేవల వినియోగదారుల్లో ఉత్తర అమెరికా వాటా 55 శాతం, ఈశాన్య ఆసియా వాటా 43 శాతంగా ఉండవచ్చని అంచనా కట్టింది. భారత్‌లో మరికొన్నాళ్ల పాటు 4జీ సేవలదే హవా కొనసాగవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య 12 కోట్ల మేర పెరగ్గా.. ఇందులో భారత్‌ వాటా 3.1 కోట్లుగా ఉందని తెలిపారు. కొత్త సబ్‌స్క్రయిబర్స్‌ విషయంలో ఎరిక్సన్‌ నివేదిక ప్రకారం డ్రాగన్ కంట్రీ చైనా 3.7 కోట్ల మంది కొత్త యూజర్లతో నెంబర్ 1 ప్లేస్‌లో ఉంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగనుండటం విశేషం.

ముంబయి: ఓ 13 ఏళ్ల చిన్నారి స్టేజీ మీద డ్యాన్స్ చేస్తూనే మధ్యలో కుప్పకూలి మరణించింది. ముంబయిలో బీజేపీ కార్పోరేటర్ కమలేశ్ యాదవ్ నిర్వహించిన డ్యాన్సు ఈవెంట్‌లో పాల్గొనేందుకు 7 వ తరగతి చదువుతున్న అనీషా శర్మ అనే బాలిక ముందుకొచ్చింది. నాట్యం ప్రారంభించిన 10 నిమిషాలకే స్టేజీ మీద అనీషా కిందపడిపోయింది. దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అనీషా మరణించిందని వైద్యులు దృవీకరించారు. మరణానికి కారణం తెలుసుకొనేందుకు ఆమె శరీరాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  
 

 

భోపాల్: ఏనుగు చచ్చినా, బతికినా ఒకటే అన్న చందంగా మనిషి బతికినా.. మరణించినా డబ్బులే డబ్బులు అంటున్నాడు అస్తిపంజరాలను స్మగ్లింగ్ చేసే ఓ వ్యక్తి. అనుమానంతో బీహార్‌లోని శారన్ ప్రాంతంలో ఒక వ్యక్తిని పోలీసులు మంగళవారం చాప్రా రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని సంజయ్ ప్రసాద్‌గా గుర్తించారు. అతను బల్లియా-సీల్డా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా అనుమానంతో అదుపులోకి తీసుకోగా అతని వద్ద దాదాపు 50 మానవ అస్తిపంజరాలు లభించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాలీయా ప్రాంతం నుంచి అస్తిపంజరాలను కొనుగోలు చేసి వాటిని భూటాన్ ద్వారా చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ అస్తిపంజరాలు హిమాలయ ప్రాంతంలో ఉండే తాంత్రికులకు సరఫరా చేస్తామని సంజయ్ ప్రసాద్ పోలీసులకు వివరించాడు. ప్రసాద్ అస్తిపంజరాల స్మగ్లింగ్ చేసే ముఠాలోని వ్యక్తిగా పోలీసు విచారణలో తేలింది. ప్రసాద్ మొబైల్ ఫోను డాటాను పరిశీలించగా అతనికి భూటాన్, నేపాల్‌కు చెందిన వారితో సంబంధాలు ఉన్నట్టు తేలింది. హిమాలయాల్లో జరిగే తాంత్రిక పూజలకు ఈ అస్తిపంజురాలను వాడతారని ప్రసాద్ పోలీసులకు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. 
అయితే.. ఈ ముఠాలోని ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రసాద్ వద్ద భూటాన్ కరెన్సీ నోట్లు, నేపాల్ సిమ్ కార్డులు లభించాయని పోలీసులు తెలిపారు. 
శారన్ పోలీసులు 2009లో ఒక బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్దనుంచి 67 మానవ అస్తిపంజరాలను స్వాధీనం చేసకోగా.. 2004 లో దాదాపు 100 మానవ పుర్రెలను ఉత్తరప్రదేశ్ లోని గయ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. దీన్నిబట్టి మానవ పుర్రెలకు, అస్తిపంజరాలకు చైనాలో భారీ డిమాండ్ ఉన్నట్టు అర్థమవుతోందని బీహార్ పోలీసు అధికారులు భావిస్తున్నారు.
 

 

భోపాల్: మధ్యప్రదేశ్ లో ఎన్నికలు  ప్రశాంతంగా జరుగుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ముగ్గురు వేర్వేరు చోట్ల గుండెనొప్పితో మరణించారు. ఇండోర్ లో ఇద్దరు, గుణలో ఒక్కరు గుండెనొప్పితో మరణించినట్లు ఎన్నికలసంఘం తెలిపింది. మరణించిన వారికి సంతాపం తెలిపిన ఎన్నికలసంఘం మరణించిన ఒక్కొక్కరి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఏక్స్ గ్రేషియా ప్రకటించింది. 

న్యూఢిల్లీ: వాహనాలు వెదజల్లే ఉద్గారాల వల్ల దేశ రాజధాని కాలుష్య కాసారంగా మారింది. ఈ కాలుష్యం కోరల్లోంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు ఎవీ ఫలించేలా లేవు. దీంతో ఢిల్లీ రోడ్లపై నడిచే మొత్తం వాహనాలల్లో కనీసం 25 శాతం విద్యుత్‌తో నడిచే వెహికల్స్ ఉండాలని ఢిల్లీ సర్కార్ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించి ఢిల్లీ ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ - 2018 ను రూపొందించింది. 
ఈ విధానం ఈవీ (ఎలక్ట్రికల్ వెహికల్స్) వాహనాల అమలుకు కొత్త మార్గదర్శకాలకు రూపకల్పన చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇక కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో 25 శాతం ఈవీ వాహనాలు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలో దుమ్ము, ధూళీ అధికం కావడంతో కాలుష్యం విజృంభించి దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందులో 30 శాతం వాహనాల నుంచి వెలువడే కాలుష్యం వల్లేనని నివేదికలు తెలుపుతున్నాయి. జీరో ఎమిషన్‌తో నడిచే విద్యుత్ వాహనాలను రోడ్లపైకి తీసుకురాగలిగితే పరిస్థితి కొంత అదుపులోకి రావచ్చు. విద్యుత్ వాహనాల అమలుకు కొంత కార్పస్ ఫండ్‌ను సైతం కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 

 

న్యూఢిల్లీ:  మనం కొత్త ప్రాంతానికి వెళుతున్నప్పుడు దారి తెలుసుకోవడానికో.. లేదా ఎదన్నా దగ్గరలో రెస్టారెంట్‌లు, పబ్‌లు ఏమన్నా ఉన్నయేమో అని తెలుసుకోవడానికి గూగుల్‌ మ్యాపును ఆశ్రయిస్తాం. కానీ ఒక ట్విట్టర్ వినియోగదారుడు గూగుల్‌ మ్యాపులో ‘‘బిచ్చెస్ నియర్ మీ’’ అని టైపు చేస్తే తన ప్రాంతంలో ఉన్న గర్ల్స్ హాస్టళ్లు, పేయింగ్ గెస్టులు కనిపించడంతో ఒక్కసారి షాక్ అయ్యాడు. 
దీన్ని స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్‌ అకౌంటులో పోస్టుచేయడంతో వైరల్ అయ్యింది. 
ఇది ఒక ప్రాంతానికో, సిటీకో పరిమితం కాలేదు.. ప్రపంచం యావత్తూ ఇదే ఫలితాలను గూగుల్ మ్యాపు చూపించడం గమనార్హం. బాలికల పాఠశాలను గూగుల్ ఎలా చూపిస్తుందో చూద్దామని చేసిన ప్రయత్నంతో ఇది బయటపడింది. బిచ్చెస్ అనే పదం పూర్తిగా మహిళలను అగౌరవసూచికంగా భావిస్తారు. అయతే గూగుల్ ఈ తప్పును సరిదిద్దుకుంది. ఇది ఒక బగ్ వల్ల ఇలా వచ్చిందని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గూగుల్ దగ్గరనుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

 

ఢిల్లీ: దేశీయ మొబైల్ తయారీ సంస్ధ డీటెల్ ఇప్పుడు అతి తక్కువధరకు తమ ఎల్సీడీ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంతవరకు చౌక ధరకు మొబైల్ ఫోన్లను అందించిన సంస్ద రూ.3,999 లకే 19 అంగుళాల టీవీని వినియోగదారులకు అందిస్తోంది. డీ1 పేరుతో మార్కెట్ లో లభ్యమయ్యే టీవీ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన ఎల్ సీడీ టీవీ అని సంస్ధ ప్రకటించింది. పెరుగుతున్నటీవీ మార్కెట్లో చౌకైన టీవీలకు ఉన్న డిమాండ్ ను గుర్తించి డీ1 టీవీని తీసుకువచ్చినట్లు సంస్ధ ఎండీ యోగేష్ భాటియా చెప్పారు. 
డీ1 టీవీ విశేషాలు
భారతదేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న డీ1 టీవీ 48.3 సెం.మీ లు లేదా 19 అంగుళాల డిస్ ప్లే  ఉంటుంది. దీని పిక్చర్ రిజల్యూషన్ 1366x768 కాగా కాంట్రాస్ట్ రేషియో 300000 గా ఉంది.  టీవీలో  కంప్యూటర్ తో  కనెక్టివిటీ కోసం ఒక హెచ్డీఎమ్ఐ, ఒక యూఎస్బీపోర్టు అమర్చారు.
ఎలా కొనాలి?
వినియోగదారులు  ప్రస్తుతం డీ1 టీవీని  డీటెల్ యాప్ ద్వారా, బీ2బీ అడ్డా.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చని, వచ్చేసంవత్సరం జనవరి  నుంచి ఫ్లిప్ కార్ట్, ఆమేజాన్ వంటి ఆన్ లైన్ సంస్ధలలోనూ టీవీ కొనుగోలు చేయవచ్చని సంస్ధ తెలిపింది.

చిత్తూరు : రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో త్వరలో భాజాభజంత్రీలు మోగనున్నాయి. ఆయన కుమార్తె ఈషా అంబానీ వివాహం డిసెంబర్ 12న జరుగనున్న సంగతి తెలిసిందే.  పిరామల్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరామల్‌ కుమారుడు ఆనంద్‌‌తో ఈషా వివాహం జరుగనుంది. ఇప్పటి నుండే పెళ్లి ఏర్పాట్లలో అంబానీ ఫ్యామీలీ బిజీబిజీగా ఉంది. అత్యంత ఖరీదైన పెళ్లికార్డును అతిథులకు అంబానీ దంపతులు అందచేస్తున్నారు.
Image result for Isha Ambani's Wedding Cardఈ సందర్భంగా పెళ్లికార్డును తిరుమల శ్రీవారి చెంత ఉంచేందుకు ముఖేష్ అంబానీ, కుమారుడు అనంత్ అంబానీలు తిరుమలకు విచ్చేశారు. నవంబర్ 27వ తేదీ ఉదయం వచ్చిన వీరు మహాద్వారం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం వీరు అర్చన సేవలో పాల్గొన్నారు. వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి టీటీడీ అర్చకుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. డిసెంబరు 8, 9 తేదీల్లో ఈషా వివాహ వేడుకలు అత్యంథ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అక్టోబరులో ఇటలీలోని లేక్‌ కోమోలో ఆనంద్‌-ఈషా నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగిన సంగతి 

-నిట్ విద్యార్థి అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు
ఛండీగడ్: కురుక్షేత్రలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి కంపార్టుమెంటు పరీక్షలకు తనను అనుమతించాలని చేసిన అభ్యర్థనను చంఢీగఢ్ కోర్టు కొట్టివేసింది. 
ఆ విద్యార్థి గత తోమ్మిదేళ్లలో 17 కాంపార్టమెంటు పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు. చివరిసారిగా తనకు పరీక్షలు రాసే అవకాశం ఈ ఏడాది ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ పిటీషన్‌పై స్పందించిన కోర్టు ఆ విద్యార్థిని మందలించింది. ‘‘దయచేసి ఇంజనీరింగ్ విద్యను వదిలేసి దేశాన్ని కాపాడండి’’ అంటూ చురకలు అంటించింది. 
తన డిగ్రీ చదువుకోసం ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తున్నందుకు విద్యార్థి తీరును తప్పబడుతూ, ప్రధాన న్యాయమూర్తి కోర్టు సమయాన్ని కూడా వృధా చేయవద్దు అంటూ ఘాటుగా విమర్శించింది. తొమ్మిదేళ్లలో 17 సార్లు పరీక్షలు ఉత్తీర్ణత కాలేనివాడివి ఈఏడాది ఒకేసారి ఎలా పాస్ అవుతావని ప్రశ్నించింది.
 

ఢిల్లీ: మధ్యప్రదేశ్,మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్ధానాలకు మిజోరంలో 40 స్ధానాలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు.ఒకే విడతలో ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్  జరుగుతుంది.  
మధ్యప్రదేశ్ లో  ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు, మిజోరంలో  ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్  జరుగుతుంది. 
మధ్యప్రదేశ్ లో 230 స్ధానాలకు 2,899 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా, మొత్తం 5,04.95.251 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్, లంజీ,బైహార్, పరస్వాద్ లలో  మధ్యాహ్నం 3గటలవరకే పోలింగ్ జరుగుతుంది.  17 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగు గుర్తించి అక్కడ భద్రత పెంచారు.  పోలింగ్ కోసం 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉన్నారు.  2లక్షలమంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద  భద్రత ఏర్పాటు చేశారు.   4వ సారి అధికారం  కోసం బీజేపీ  ప్రయత్నిస్తుండగా, 15 ఏళ్ల  తర్వాత అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 
> అధికార బీజేపీ 230 స్ధానాలకు 
> కాంగ్రెస్ 229స్ధానాలకు 
>లోక్ తాంత్రిక్ జనతాదళ్ 1
>227 బీస్పీ
>51 సమాజ్ వాది పార్టీ
>ఆమ్ ఆద్మీ 208 స్ధానాల్లో పోటీ చేస్తున్నాయి.
మిజోరంలో  7.7 లక్షల మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.  2008 , 2013 లో అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సారి కూడా అధికారాన్ని  చేజిక్కించుకోవాలని యత్నిస్తోంది. మిజోరంలో 40 అసెంబ్లీ  స్ధానాలకు 209 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా  కాంగ్రెస్, మిజో నేషనల్  ఫ్రంట్ మధ్య  పోటీ నెలకొని ఉంది. 

 

 

న్యూఢిల్లీ: వసతి గృహాల్లో చిన్నారి బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారా.. చర్యలు తీసుకోవడంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ బీహార్ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముజఫూర్‌నగర్ వసతిగృహంలో షెల్టర్ తీసుకుంటున్న బాలికలపై  లైంగికవేధింపుల కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు మదన్ బి లోకూర్ ఆద్వర్యంలోని ప్రత్యేక బెంచి బీహార్‌లోని వసతి గృహాల్లో ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. అన్ని కేసులు సీబీఐకే అప్పజెపితే బాధితులకు సత్వర న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించింది. పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేయకపోతే ఇటువంటి దారుణమైన ఘటనల్లో నిజాలు బయటకు రావని కోర్టు వ్యాఖ్యానించింది.
ఐపీసీ సెక్షన్ 377ను ఉపయోగించి ఎన్ని కేసులు నమోదు చేశారో తెలపాలని తూర్పారపట్టింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వసతిగృహాల్లో జరిగే అకృత్యాలను మీరు టేకప్ చేస్తారా అంటూ సీబీఐ కౌన్సెల్‌ను కోర్టు ప్రశ్నించింది. 
 

 

సీజనల్ ఫ్రూట్స్ అయిన రేగి పండ్లు తెలుసు కదా.. వగరుగా, తియ్యగా, పుల్ల పుల్లగా ఉంటాయి. రోడ్డు సైడ్ బండి కనిపిస్తే చాలు ఆగి నాలుగు నోట్లో వేసుకుంటాం. ఆరోగ్యానికి మంచిది అని మరో నాలుగు ఇంటికి పట్టుకెళతాం. ఇక్కడి వరకు అయితే పర్వాలేదు.. రేగిపండ్లు తిని డ్రైవింగ్ చేస్తే యమా డేంజర్. పుట్టి బుద్ది ఎరిగాక ఇలా ఎవరూ చెప్పలేదు.. ఎందుకు అంటారా.. అక్కడికే వస్తున్నాం.

రేగిపండ్లు తింటే మిషన్ చెప్పేస్తోంది :
టైటిల్ చూసి షాక్ అవ్వొద్దు.. అమ్మతోడు ఇది నిజం. ఇదెవరో చెప్పింది కాదు.. పోలీస్ స్టేషన్‌లో బ్రీత్ అనలైజర్ టెస్టులో ఓ పోలీస్ చూపించిన నిజం. ఓ పోలీస్‌కు మొదటగా బ్రీత్ అనలైజర్ టెస్టు ద్వారా రీడింగ్ చెక్ చేస్తారు. ఆల్కాహాల్ శాతం జీరో అని వస్తుంది. ఆ తర్వాత ఓ మూడు రేగి పండ్లు తింటాడు ఆ పోలీస్. మిషన్ నోట్లో పెట్టి ఊదుతాడు. అంతే రీడింగ్ 550 చూపిస్తుంది. ఆల్కాహాల్ అస్సలు తీసుకోలేదు.. అయినా రేగిపండ్లు తిన్న తర్వాత మిషన్ రీడింగ్ చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఏ పోలీస్ స్టేషన్‌లో తీశారు.. వాళ్లు ఎవరు.. ఎందుకు పరీక్షించారు.. వాళ్లకు ఎందుకు డౌట్ వచ్చింది.. ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ మాత్రం రీడింగ్ చూపిస్తోంది. రేగిపండ్లు తిని బండి తీస్తే.. పోలీసులకు దొరికితే జైలు ఖాయం అని ఈ రీడింగ్ చెబుతోంది.

550 రీడింగ్ ఎలా వస్తుంది ?
రేగిపండ్లు తింటే బ్రీత్ అనలైజర్ ఎందుకు అంత రీడింగ్ చూపిస్తుందీ.. ఆల్కాహాల్ కంటే రేగిపండ్లలో అంత మత్తు పదార్థం ఉందా అనే డౌట్ వస్తుంది. వాస్తవంగా రేగిపండ్లు ఎన్ని తిన్నా మత్తు ఉండదు.. శరీరంలో మాత్రం ఆల్కాహాల్ శాతం ఎలా చూపిస్తుంది అనేది సామాన్యులకు అంతుచిక్కటం లేదు. ఈ వీడియోలో మార్ఫింగ్ చేసింది అనటానికి కూడా ఆస్కారం లేదు.. అంతా పక్కాగా అనిపిస్తోంది. నాలుగు బీర్లు, ఫుల్ బాటిల్ కొడితే వచ్చేంత రీడింగ్.. మూడు రేగి పండ్లు తింటే ఎలా వచ్చింది అనే క్వశ్చన్లతో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇది ఫేక్ అయ్యి కూడా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

550 రీడింగ్ అంటే జైలుకే..:
రేగిపండ్లు తిని బండి తీస్తే.. పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దొరికితే మాత్రం నేరుగా జైలుకి వెళ్లటం ఖాయం. ఎందుకంటే 35 దాటితేనే జైలు అంటున్నారు.. అలాంటిది 500 చూపిస్తే ఊరుకుంటారా.. ఓ నెల రోజులు అయినా జైల్లో ఉండాల్సిందే.. సో.. బీ కేర్ ఫుల్ రైడర్స్... ఇది నిజమా.. అబద్దమా అనేది తెలియలేదు. ఎవరికి వాళ్లు నెటిజన్లు షేర్లు చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులే. లేకపోతే అప్పటి వరకు ఇది తిరుగుతూనే ఉంటుంది..

ఢిల్లీ : త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారణి బీజేపీ పార్టీలో చేరారు. 1994 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారిణి అపరాజిత..ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరారు. నవంబర్ 16న వాలంటరీ రిటైర్మెంట్ కోసం అప్లై చేసుకున్నారు. ఆమె దరఖాస్తును అంగీకరించిన బీజేపీ ప్రభుత్వం ఆమె రిటైర్మెంట్ ను ఆమోదించింది. కాగా విధులు నిర్వహణలో అపరాజిత  మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాయింట్‌ సెక్రటరీగాను..ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ గా పనిచేశారు. అపరాజితను అమిత్ షా వద్దకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడు బసంత్ పాండా  ఆధ్వర్యంలో ఆమె బీజేపీలో చేరారు.
 

 

కురుక్షేత్ర: హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలో  మంగళవారం తెల్లవారుఝూమున కల్కాహౌరా ఎక్స్ ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఇంజన్ వెనుక వున్న బోగీలో మంటలు గమనించిన రైల్వేసిబ్బంది వెంటనే రైలును ఆపి మంటలు అదుపులోకితెచ్చారు. ఈఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. పొగ వలన ఇద్దరికి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రైలు యధావిధిగా నడుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు సంభవించి ఉంటాయని, ఘటనపై విచారణ జరిపిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 

న్యూఢిల్లీ: వారం క్రితం ఒక వ్యక్తి కారంపొడి జల్లేందకు ప్రయత్నించగా.. అరెస్టయిన ఘటన మరువక ముందే..తాజాగా మరోవ్యక్తి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సందర్శకుని ముసుగులో తుపాకి బుల్లెట్ తీసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటాన్ని గమనించిన భధ్రతా సిబ్బంది 39 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసకున్నారు. పన్నెండు మందిగల మతగురువుల బృందం సోమవారం ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి తీసుకుంది. అందులో మహమ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా వక్ఫ్ బోర్టు చెల్లించే వేతనాన్ని పెంచాలని కోరేందుకు కేజ్రీవాల్ ఇంటివద్ద జరిగే ఒర్జాంట దర్బారుకు వచ్చాడు. ఇమ్రాన్‌ను పరీక్షిస్తుండగా అతని పర్సులో ఒక బులెట్‌ను గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని నిలిపివేశారు. ఒక  మసీదులో సంరక్షకుడిగా పనిచేస్తున్న ఇమ్రాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 
మసీదులో ఉన్న హుండీలో ఎవరో బులెట్‌ను వేశారని అది తన బ్యాగులో పెట్టుకుని మరిచిపోయినట్టు ఇమ్రాన్ పోలీసులకు తెలిపాడు. ఆ బుల్లెట్‌ను యమున నదిలో విసిరేద్దామని అనుకున్నానని కానీ తన బ్యాగులోనే ఉంచుకున్నానని అతను చెప్పాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
 

 

భోపాల్: భారతీయ జనతా పార్టీ 15 ఏళ్లుగా నిర్మించిన మధ్యప్రదేశ్ కోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్ ఇతర పార్టీలు హోరాహోరీ పోరుకు తలపడుతున్నాయి. 13 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఏకచత్రాధిపత్యాన్ని కొససాగిస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ తన సంక్షేమ పథకాలే తనను నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు దోహదపడతాయని విశ్వసిస్తుంటే.. చౌహాన్‌ను చూసి చూసి జనం మొహం మొత్తిపోయారని గెలుపు తమదే అంటూ కాంగ్రెస్ నేతలు మూకమ్మడిగా ఎదురుదాడికి దిగుతున్నారు. 2003 నుంచి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. సోమవారం (నవంబర్ 26)తో ప్రచారం సమాప్తమయ్యింది. బరిలో ఉన్న రాజకీయ పార్టీలు బలాబలాలు తేల్చుకొనేందుకు మొహరించి ఉన్నాయి. దాదాపు 50 లక్షమంది ఓటర్లు 230 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,907 అభ్యర్థుల భవితవ్యాన్ని నవంబర్ 28 (బుధవారం)న జరిగే ఎన్నికల్లో తేల్చనున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు బీఎస్పీతో సమాజ్‌వాదీ పార్టీ, గౌండ్వానా గణతంత్ర పార్టీ, ఆమ్ అద్మీపార్టీలతో పొత్తుకుదుర్చుకొని అతిపెద్ద కూటమిగా ఎన్నికల బరిలో నిలిచింది.

2008 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల లాబలాలు
పార్టీలు సీట్లు ఓటింగ్ శాతం
బీజేపీ 143 38
కాంగ్రెస్ 71 32
ఇతరులు 16 30
మొత్తం సీట్లు 230  
2013 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు
పార్టీలు సీట్లు ఓటింగ్ శాతం
బీజేపీ 165 44.8
కాంగ్రెస్ 58 36.4
ఇతరులు 7 19
మొత్తం సీట్లు 230  

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎదుర్కొనేందుకు విబేధాలను పక్కకు పెట్టి సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపై నిలిచారు. కమలనాథ్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాధిత్య సింధియా లాంటి నాయకులు మూకమ్మడిగా దాడి చేస్తూ చౌహాన్‌ను నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకుండా అడ్డుకొనేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ‘‘చౌహాన్‌కు రాజకీయాలంటే విరక్తి వచ్చిందని.. 13 ఏళ్లు పాలించేసరికి పదవీకాంక్ష పోయిందని..కాబట్టి ఆయన ఇంటికిపోవడం ఖాయం’’ అంటూ  కాంగ్రెస్ నేతలు తమకు తాము బలం తెచ్చుకొనేందుకు అన్ని యుక్తులను ప్రచారంలో ప్రదర్శించారు. ఇక శివరాజ్ సింగ్ బలాలు బలహీనతలు ఇలా ఉన్నాయి

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బలాలు

 • ఫ్యాక్టరీల్లో పనిచేసే వర్కర్లకోసం సంభల్ పథకం ఇస్తున్న సత్ఫలితాలు
 • పెళ్లిచేసుకునే వారికి ప్రకటించిన నజరానాలు
 • గ్రామీణ రోడ్లకు మహార్దశ
 • వృధ్యాప్య ఫించన్లు
 • వృథ్ధులకు ఒకసారి తీర్థయాత్ర ఖర్చులు చెల్లించడం
 • ప్రతీ ఆడపిల్లకు రూ 6 వేలు 5 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు
 • స్కూలుకు వెళ్లే బాలికలకు ఉచిత సైకిళ్లు
 • ప్రతిభగల బాలికలకు రూ. 5 వేల స్టైఫండ్

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బలహీనతలు

 • మూడు పర్యాయాలు అధికార పీఠంలో ఉన్నందుకు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
 • మందాసర్ జిల్లాలో మద్ధతు ధరలకోసం 6 గురు రైతుల ఆత్మహత్యలు
 • ఎస్సీ, ఎస్టీల ప్రమోషన్ల రిజర్వేషన్ల కోసం నిరసన జ్వాలలు
 • పలువురు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత
 • చౌహాన్ సర్కార్‌పై రైతుల, అగ్రవర్ణాల వారి తిరుగుబాటు
 • మోదీపై వ్యతిరేకత చౌహాన్ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం
 • అధ్వాన్నంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

తనపై వస్తున్న వ్యతిరేకతలను గమనించి వాటిని అధిగమించేందుకు గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. తన వ్యక్తిగత బలంతో 2008లో 143 సీట్లను 2013 నాటికి 165 సీట్లకు చేర్చిన చౌహాన్..సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రధ్దపెట్టారు. తన సంక్షేమ పథకాలే తనను నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించేలా దోహదపడతాయని చౌహాన్ బలంగా నమ్ముతున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ ఏడాది జూన్ నుంచి ఆరు సార్లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి 20 పైగా బహిరంగ సభల్లో, 5-6 ఎన్నికల రోడ్ షోలల్లో పాల్గొన్నారు. జ్యోతిరాధిత్య సింధియా దాదాపు 100 బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను పార్టీకి ఓటువేసేవిధంగా ప్రసంగాలు చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారాన్ని నవంబర్ 16 దాదాపు 30 నియోజకవర్గాలున్న వింధ్య ప్రాంతంలో మాత్రమే పర్యటించి ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకుడు రాజ్‌బబ్బర్ రూపాయి - డాలర్ మారకం విలువను మోదీ తల్లి వయస్సుతో పోల్చి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.  దీంతో మోదీ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మధ్యప్రదేశ్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో హోరు పోటాపోటీగా సాగుతోంది. ఓట్ల కౌంటింగ్ డిసెంబరు 11 న జరిగే ఓట్ల లెక్కింపులో పార్టీల భవితవ్యం తేలిపోనుంది.

 

న్యూఢిల్లీ: ఇది పోలీసు స్టేషన్. కానీ అక్కడ పిల్లలు ఓనమాలు దిద్దుతుంటారు. అదేంటి పిల్లలు స్కూల్లో కదా వుండాలి..పోలిస్ స్టేషన్ లో చదువులేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. పోలీస్ స్టేషనే బడిగా మారిపోయిన వైనం. ఇది ఓ యువకుడు సాధించిన విజయం. ఈ విజయానికి ఫలితం అసలు బడి మొహం కూడా చూడని మురికివాడల పిల్లలు ఇప్పుడీ పోలీస్ స్టేషన్ లో చదువులు నేర్చుకుంటున్నారు. పోలీస్ బడిలో ఓనమాలు దిద్దేస్తున్నారు. ఇదంతా సందీప్ బోహత్ అనే యువకుడి కృషికి నిదర్శనం. 
20 ఏళ్ల సందీప్ బోహత్ మురికివాడలలో నివసించే 40 మంది  పిల్లలకు పాఠాలు చెప్పి వారి జీవితాలను మార్చివేశాడు. వారికి ఒక పార్కులో ఉచితంగా వారికి బోధన ప్రారంభించారు. అక్టోబర్ 29 న ఈ ప్రయత్నంలో అనేక మంది సహాయంతో ముందుకు వచ్చారు. ఇన్స్పెక్టర్ సింగ్ ఉన్నారు, వీరు వారికి పోలీస్ స్టేషన్లో ఒక గదిని ఇచ్చారు. ఇలా కాలక్రమేణా చాలామంది ప్రజలు సహాయం చేయటానికి ముందుకొచ్చారు. అంతేకాదు ఇక్కడ ఖాళి సమయంలో మహిళా పోలీసులు కూడా ఈ పిల్లలకు చదువులు చెబుతుంటారు.
మురికివాడల యొక్క దుర్భర పరిస్థితిని గురించి అతను ఏదో చేయాలని అనుకున్నాడు.అతను వారికి శిక్షణనివ్వడం మొదలుపెట్టాడు..మురికివాడ గృహంలో జీవితాలు ఎలా వుంటాయో బోహాత్ మురికివాడల్లో పర్యటించి అర్థం చేసుకున్నాడు. ఒక స్వీపర్ కుమారుడుగా వుండే తాను చదువుకునేందుకు వచ్చినప్పుడు అటువంటి ఆర్థిక అడ్డంకులు ఎదుర్కొన్నాడు. అతను ఇప్పుడు స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుండి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. 

బోహత్ రోజువారీగా చిన్న  చిన్న మొత్తాలను కూడబెట్టి మురికివాడల్లో మరుగుదొడ్లు నిర్మించగలిగాడు. తన పుట్టినరోజుకు వినియోగించే డబ్బుతో ముగ్గురు మహిళలు మరియు వికలాంగుడైన ఒక కుటుంబానికి ఒక టాయిలెట్ నిర్మించడానికి ఒక కాలనీ నివాసి కూడా ముందుకొచ్చారు. 
ఇది గమనించిన ప్రేమ్‌నగర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ముఖేశ్‌ త్యాగి పాఠశాలను పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో  నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. నగరంలోని రోహిణి సౌత్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఉదయం, పిల్లలు వారి తరగతిలోకి వచ్చేసరికి ప్రతి విద్యార్ధికి, ఒక వార్డ్ రోబ్, ఫర్నిచర్ కోసం వేచి ఉన్న పుస్తకాలు ఉన్నాయి. ఇదంతా బోహత్ కృషి ఫలితమే.  ఈ సందర్భంగా బోహత్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సమావేశానికి ఇన్స్పెక్టర్ జగ్మిందర్ సింగ్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ హాజరయ్యారు. 
 

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు  త్రినాంకుర్ నాగ్ (26) విధి నిర్వహణలో ఉండగా కరెంట్ షాక్ తో మృతి చెందారు.  కోల్ కతా లోని కంకుర్గాచి రైల్వే కార్ షెడ్ లో శనివారం నాడు  పని చేస్తుండగా, హైటెన్షన్ లైను తగలటంతో  తీవ్రగాయాలకు లోనయ్యాడు.  వెంటనే అతడ్ని బీఆర్ సింగ్ ఆసుపత్రిలో చేర్పించారు 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. 
స్పోర్ట్స్ కోటాలో  రైల్వేలో ఉద్యోగం పొంది, ఈస్ట్రన్ రైల్వేలో పనిచేస్తున్న త్రినాంకుర్ నాగ్, ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ డబుల్స్‌ నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌ ఆటగాడిగా ఉన్నారు. చిన్నప్పటినుంచి బ్యాడ్మింటన్ పట్ల ఆసక్తి ఉన్న నాగ్ తల్లి తండ్రుల ప్రోత్సాహంతో పలు టోర్నీల్లో అనేక బహుమతులు పొందాడు. 
"త్రినాంకుర్ నాగ్ మరణం బెంగాల్  బ్యాండ్మింటన్ కు తీరని లోటని, రాష్ట్రానికి ఏన్నో పతకాలు సాధించి  పెట్టిన నాగ్ మరణం చాలా బాధించిందని,  రాష్ట్రం గొప్ప క్రీడాకారుడిని కోల్పోయిందని, అతను లేనిలోటు పూడ్చలేనిదని" పశ్చిమ బెంగాల్  బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధికారి బిశ్వాస్ సంతాపం తెలిపారు. 

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పనిచేస్తున్న సునీల్‌ అరోరాను కొత్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 2న అరోరా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.  ప్రస్తుతం సీఈసీగా ఉన్న ఓపీ రావత్‌ పదవీకాలం డిసెంబరు 2న ముగుస్తుంది. 1980 బ్యాచ్, రాజస్ధాన్ కేడర్ కు చెందిన ఐఏఎస్‌ అధికారి అరోరా గతే ఏడాది సెప్టెంబర్‌లో ఎన్నికల సంఘం అధికారిగా నియమితులయ్యారు. గతంలో ఆయన సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో స్కిల్  డెవలప్ మెంట్  సెక్రటరీ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్థికమంత్రిత్వశాఖ, టెక్స్‌టైల్‌,  టెక్స్టైల్స్ అండ్ ప్లానింగ్ కమిషన్‌ శాఖల్లోనూ అరోరా పనిచేశారు. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సీఎండీగానూ 5 ఏళ్లపాటు సేవలందించారు. రాజస్ధాన్ లో వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో (2005-2008) ప్రిన్సిపల్ సెక్రటరీ గా కూడా సునీల్ అరోరా పనిచేశారు. 

నర్సరీ నుంచే బరువుల మోత.. నాలుగో తరగతికి వచ్చే సరికి మోయలేని భారం.. వీపులపై మోయలేని భారం మోస్తున్నారు పిల్లలు. స్కూల్ బ్యాగ్ బరువు మోయలేక.. స్కూల్‌లోని మెట్లు ఎక్కుతూ కుప్పకూలి ఓ స్టూడెంట్ చనిపోయిన ఘటన తెలిసిందే. ఎప్పటి నుంచో స్కూల్ బ్యాగ్ బరువులపై వివాదం నడుస్తోంది. దీనిపై సుదీర్ఘంగా మేధావులతో చర్చించిన కేంద్ర మానవ వనరుల శాఖ.. కొత్తగా విధివిధానాలు రూపొందించింది. ఏయే తరగతికి.. స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలి అనేది నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
తరగతులు బ్యాగ్ బరువు
1-2 వరకు 1.5 కేజీలోపు
3-5 వరకు 2-3 కేజీలలోపు
6-7 వరకు 4 కేజీలకు మించకూడదు
8-9 వరకు 4.5 కేజీల వరకు ఉండొచ్చు
10వ తరగతి 5 కేజీల వరకు ఉండొచ్చు
 
ఇది స్కూల్ బ్యాగ్ బరువు మాత్రమే. లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అదనం. పుస్తకాల బరువు మాత్రం ఆయా తరగతులకు.. అంతకంటే మించకూడదు..

జంబోని (వెస్ట్ బెంగాల్) : ఒకపక్క వీహెచ్పీ, ఆర్ఎస్సెస్‌లు రామమందిర నిర్మాణానికి వత్తిళ్లు పెంచుతుంటే.. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ నేతలు పూజించేంది రాముడిని కాదు.. రాక్షసరాజైన రావణాసురుడిని అంటూ ఫైర్ అయ్యారు. దేవుడి పేరుచెప్పి ఓట్లు కొల్లగొట్టేందుకు తన పార్టీ ఎప్పుడూ ప్రయత్నించదని మమతా ఎద్దేవా చేశారు. వాళ్లు పూజ చేసేది రావణుడికి.. రాముడికి కాదు. దేవుడిపేరు చెప్పి వాళ్లు (బీజేపీ నేతలు) ప్రజలను విడదీస్తున్నారని సోమవారం బహిరంగసభలో ప్రసంగిస్తూ విమర్శించారు. 
 

 

బిల్వారా (రాజస్థాన్): రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడుతూ రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ నేతలపై పెద్దఎత్తున ఎదురుదాడికి దిగారు. 166 మంది ప్రాణాలు తీసిన 26/11 ముంబై టెర్రర్ దాడులకు పదేళ్లు నిండిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ... 2008లో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ సర్కారును నడుపుతూ మాకు దేశభక్తి గురించి పాఠాలు చెబుతోంది.. అదే తమ ప్రభుత్వం సర్జికల్ దాడులకు దిగితే తిరిగి మమ్మల్నే ప్రశ్నిస్తోందని మోడీ విమర్శించారు. విదేశీ భూభాగంలోకి ధైర్యంగా మన సైనికులు ప్రవేశించి సర్జికల్ దాడులను చేసినందుకు దేశం యావత్తూ సగౌవరంగా స్వీకరించగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వీడియో ఆధారాలకోసం ప్రశ్నల వర్షం కురిపించారని.. పోరాటానికి వెళ్లే సైనికులు తమతోపాటు ఆధారాల కోసం కెమేరాలను తీసికెళతారా.. అంటూ మోడీ ప్రశ్నించారు.  రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి.. మీరెప్పుడన్నా ప్రధాని శలవులో ఉండగా చూశారా.. కనీసం మీరెప్పుడన్నా విన్నారా.. నేను శలవుతీసుకొని సరదాగా టూర్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.  
 

 

హైదరాబాద్ : టీవీలు, ఫ్రిజ్‌లు కొనాలనుకుంటున్నారా..? అయితే ఏమాత్రం ఆలశ్యం చేయకుండా వెంటనే కొనేయండి. ఓ నాలుగు రోజులు ఆగుదాము అనుకున్నారో.. మీరు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. అవును. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి, ఎలెక్ట్రానిక్ గూడ్స్ ధరలను పెంచేయాలని అన్ని ప్రధాన కంపెనీలు ఓ నిర్ణయానికి వచ్చేశాయి. 
ధరలు పెరిగేవి ఇవే..
టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్‌లు, ఏసీల ధరలపై తక్షణ ప్రభావం పడబోతోంది. ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ ధరలు కూడా పెరిగే చాన్స్ లేకపోలేదు. స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్‌లో జియామీ ఇప్పటికే 15శాతం మేర ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర స్మార్ట‌ఫోన్‌ తయారీ సంస్థలూ ఇదే బాట పట్టే అవకాశం ఉంది. ఇక హోం అప్లయెన్సెస్‌కి సంబంధించి, పానసానిక్ సంస్థ ఏడు శాతం మేర ధరలు పెంచాలని నిర్ణయానికి వచ్చింది. ఈరంగంలో దిగ్గజంలాంటి గోడ్రెజ్ సంస్థ కూడా ఇదే రేంజ్‌లో రేట్లు పెంచాలనుకుంటోంది. హెయిర్ సంస్థదీ ఇదే బాట. అయితే ఒక్క సోనీ మాత్రమే ఇంకా డెసిషన్ తీసుకోలేదు. నిజానికి సెప్టెంబర్ నెల్లోనే ధరలు పెంచాలనుకున్నారు. కానీ, పండుగల సీజన్ కావడం.. అమ్మకాలపై భారీగా ప్రభావం పడుతుందన్న ఆందోళనతో కంపెనీలు వెనక్కి తగ్గాయి. 
ఉన్నట్టుండి ఎందుకీ పెంపు..?
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. దీని ప్రభావంతో కంపెనీల మీద దిగుమతుల భారం బాగా పెరిగిపోయింది. అదే రేషియోలో ప్రొడక్షన్ కాస్ట్ కూడా అంచనాలను మించిపోయింది. దీనికితోడు, ఈసారి పండుగల సీజన్‌ కూడా హోం అప్లయెన్సెస్ రంగానికి ఏమాత్రం ఆశాజనంగా లేదు. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో తుపానులు, వరదల కారణంగా, పండుగల సీజన్ బోసిపోయింది. అందుకే ధరలు పెంచాలని దాదాపుగా అన్ని బ్రాండెడ్ కంపెనీలూ నిర్ణయానికి వచ్చాయి. 

 

న్యూఢిల్లీ: ఇప్పటికే స్కూలు బ్యాగుల బరువుపై పరిమితి విధించిన మోడీ సర్కార్ తాజాగా స్కూలు పిల్లలకు మరో వరం ప్రకటించింది. ఒకటి, రెండు తరగతుల పిల్లలకు ‘నో హోంవర్క్’ అంటూ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసింది. 
పాఠ్యాంశాలను వినూత్నంగా బోధించేందకు, పిల్లలకు స్కూలు బ్యాగుల బరువు ఎక్కువ కాకుండా ఉండేవిధంగా కొత్తగా మార్గదర్శకాలను రూపొందించుకోవాలని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇందులో భాగంగా ఒకటి, రెండు తరగతులు చదివే పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదని సూచించింది.
 

 

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు కోర్టు నుంచి రక్షణ కవచం వీడిపోబోతోంది. వచ్చేనెల 18వరకు చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం అరెస్టు కాకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ..సీబీఐ దానికి విరుగుడుగా.. కోర్టులో కొన్నివివరాలను ప్రకటించింది. తమకు చిదంబరంను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం వద్దనుంచి అనుమతి ఉందని సోమవారం (నవంబర్ 16) పాటియాల హౌజ్ కోర్టుకు సీబీఐ తెలిపింది.  ఎయిర్ సెల్ - మ్యాక్సిస్ కేసుకు సంబంధించి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంను విచారించేందుకు తమకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీబీఐ కోర్టులో తెలిపింది. చిదంబరం సహా 18 మందిపై చార్జిషీటు జులై 19, 2018న ధాఖలు చేసినట్టు ప్రత్యేక జడ్జి ఓపీ సైనీకి సీబీఐ న్యాయవాది తెలిపారు. 
చిదంబరంను ప్రాసిక్యూట్ చేసేందుకు అవినీతి నిరోధక చట్టం, 1988 సెక్షన్ 197 కింద కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించిందని కోర్టులో వేసిన పిటీషన్‌లో సీబీఐ తెలిపింది. కేసులో ఇతర నిందితులను సైతం విచారించేందుకు అనుమతుల కోసం చూస్తున్నట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది.
 

 

Pages

Don't Miss