National News

ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ లో భారత క్రీడకారులు సత్తా చాటారు. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులు దేశంలో అడుగు పెట్టారు. ఈసందర్భంగా కుటుంబసభ్యులు, అభిమానులు, ఇతరులు వారికి ఘన స్వాగతం పలికారు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో భారత ఏషియాడ్ మెడలిస్టులకు పూలమాలలు..శాలువాలతో సత్కరించి బ్రహ్మరథం పట్టారు. దేశానికే గర్వ కారణంగా నిలిచారని పలువురు కొనియాడారు. మొత్తం 15 రోజలు పాటు ఈ...

రాజకీయాల్లో ఉన్న నేతలు...ఎన్నో విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఏదైనా మాట్లాడినప్పుడు కానీ...వ్యవహర శైలి..తదితర విషయాల్లో జాగ్రత్త పడుతుంటారు. వారు ఏదైనా మాట్లాడినా...వ్యవహరించినా ప్రత్యర్థులు వాటిని చక్కగా ఉపయోగించుకుని విమర్శల దాడిని పెంచుతుంటారు. కొన్ని సందర్భాల్లో నేతలకు ఇది తలనొప్పిగా మారుతుంటుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా పలువురు విమర్శలు...

దేశ రాజధాని మరోసారి దద్ధరిల్లింది. పాలకుల విధానాలపై రైతులు..కార్మికులు కదం తొక్కారు. ఇటీవలే రైతులు మహా మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. భారతీయ కిసాన్ సభ ఈ పోరాటానికి నేతృత్వం వహించింది. తాజాగా కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు..కార్మికులు..మహా ధర్నా చేపట్టారు. రాంలీలా మైదనం నుండి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ఈ మహా ర్యాలీ కొనసాగింది. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూ ఆధ్వర్యంలో '...

తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం ఎన్నో హాట్ హాట్ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో ఒక్కసారిగా డీఎంకేలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా డీఎంకేలో అన్నదమ్ముళ్లు సై అంటే సై అంటున్నారు. డీఎంకే పగ్గాలు...

గృహిణులకు వంటింట్లో పిడుగులాంటి వార్త పడబోతోందంట. వంటింట్లో కీలక భాగమైన 'గ్యాస్' ధర మరోసారి పెరగబోతోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. భవిష్యత్ లో ఏకంగా రూ. 1000 ధరకు ఎగబాకనుందని టాక్. 'అచ్చే దిన్' అని చెబుతున్న పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు...

సెప్టెంబర్ 5...సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ప్రముఖుల దినోత్సవాలు..ఇతర ముఖ్యమైన రోజుల్లో గూగుల్ డూడుల్స్ ను రూపొందిస్తున్న...

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఎవరైనా భోజనం చేయాలనుకుంటున్నారా అయితే 82,500 రూపాయలను సిద్ధం చేసుకోవాల్సిందే. ఆశ్చర్యపోతున్నారా..? అయితే మీరే చూడండి. రాహుల్‌ గాంధీ ఇటీవల యూకే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ నిర్వహించిన కార్యక్రమాల పట్ల పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ హాజరైన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి...

ఒడిషా : సాధారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంటుంది. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులు ఉండరు. కాని ఒక పాఠశాలలో ఉపాధ్యాయులకు తగట్టుగా విద్యార్థులు లేరు. ఒక వైపు పాఠశాలల్లో తరగతులు, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేకుంటే... మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పది మంది కంటే తక్కువగా ఉన్నా ఉపాధ్యాయులు ఎక్కువ...

ముంబయి : బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా మరో నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో అధికార బీజేపీకి చెందిన ఘట్కోపర్‌ ఎమ్మెల్యే రాం కదం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిల ప్రతిపాదనను తిరస్కరించిన అమ్మాయిలను కిడ్నాప్‌ చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి....

అమెరికా : చేపల్ని పెంపకంపై ఇప్పుడు కోట్లాది రూపాయలు టర్నోవర్ అవుతున్నాయి. చేపల్ని ఎక్కువగా తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. ఒకప్పుడు కాలువల్లోను, నదుల్లోను, సముద్రాల్లోను పెరిగిన చేపల్నే తినేవారు. కానీ గత కొంతకాలంగా చేపల చెరువుల్లో ఒక వ్యాపారంగా మారిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే చేపల్ని ఒకచోటి నుండి మరొక చోటికి తరలించేందుకు సాధారణంగా...

జమ్ము కశ్మీర్ : దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవానుల ధైర్యసాహసాలతో దేశ ప్రజలకు భరోసా నిచ్చే జవానుల త్యాగాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ జవాన్లకు దిశానిర్దేశం చేస్తు అనుక్షణం అప్రమత్తంగా వుండి..దేశ భద్రత బాధ్యతను కడు సమర్థవంతంగా నిర్వహించే ఆర్మీ అధికారుల సమయోచిత శక్తి యుక్తులతో భారత భద్రత ఆధారపడి వుంది. ఈ నేపథ్యంలో...

ఢిల్లీ : గజరాజుల్ని చూస్తే చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా ఆనంద పడుతుంటారు. ఏనుగును చూస్తే ఏడ్చే పిల్లలు కూడా కిలకిలా నవ్వేస్తారు. పెద్ద ఆకారం, చిన్ని చిన్ని కళ్లు, పెద్ద పెద్ద చెవులు ఇలా గజరాజులో అన్ని ప్రత్యేకతలే. ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన అంటు పాటలు పాడుకుంటు గజరాజులను చూసి, విని, పాడుకుంటు మురిసిపోతాం. కానీ ఇక్కడ...

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం తారాస్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ పై 16 పైసలు, డీజిల్ పై 19 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోలు లీటరు ధర రూ.84.09 కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోకపోతే లీటరు ధర వంద రూపాయలకు చేరుకొన్నా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నా...

పశ్చిమబెంగాల్ : రాజధాని కోల్ కతాలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ కోల్ కతాలోని పురాతన మజర్ హట్ వంతెన రైల్వే ట్రాక్ పై కుప్పకూలింది. బస్సులు, కార్లు వంతెనపై పయనిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి....

రోజు మనం తీసుకునే ఆహారంమీదనే మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. తేలికగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం ఉత్సాహంగా తయారవుతుంది. అదే కష్టంగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం అనారోగ్యాల బారిని పడటమే కాక..మనం తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేసేందుకు మనం శరీరం కష్టపడితే అతి త్వరగా మన శరీరం అలసిపోతుంది. దీంతో పలు ఆరోగ్యం సమస్యలు తలెత్తుతాయి. అందుకే శరీరానికి పుష్కలంగా ప్రొటీన్స్, కాల్షియం, ఐరన్...

ఢిల్లీ : ఐదు సార్లు యూఎస్ ఓపెన్ విజేత, స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కు చుక్కెదురైంది. యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో భాగంగా జరిగిన పోటీల్లో ఓ అనామకుడి చేతిలో ఓటమి పాలయ్యాడు ఫెదరర్. యూఎస్‌ ఓపెన్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్‌ మిల్‌మాన్‌ సంచలనం సృష్టించాడు. పురుషులు ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో టెన్నిస్‌ దిగ్గజం, నంబర్‌ 2 సీడ్‌ ఆటగాడైన...

ఢిల్లీ : కొంతమందికి డ్రైవ్ చేయటంలో మజా ఫీలవుతుంటారు. ఈ క్రమంలో వారు ర్యాష్ గా..స్టైల్ గా..కేర్ లెస్ గా డ్రైవ్ చేస్తుంటారు. దీంతో వాహనాలు పలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో వాహనం పూర్తిగా డేమేజ్ కావచ్చు. ఆ ఏముందిలే..బీమా వుందిగా..మనకెందుకు చింత అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు యాక్సిలేటర్ మీద కాలేసినట్లే. ర్యాష్ డ్రైవింగ్...

కేరళ : ఒక పక్క ప్రకృతి విపత్తును నుండి కోలుకుంటున్న కేరళ ప్రజలు ఇప్పుడిప్పుడే శ్వాస పీల్చుకుంటున్నారు. ఇంతలోనే మరో భయం వారిని వెన్నాడుతోంది. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వందేళ్ల కేరళ చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తులో సుమారు 483 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. 14....

బర్మా : మయన్మార్‌లో ఇద్దరు రాయిటర్స్‌ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంతో మయన్మార్‌ కోర్టు వా లోన్, కియా సోలను దోషిగా తేల్చిన కోర్టు ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. గత ఏడాది మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన హింసాకాండకు సంబంధించి వీరు రిపోర్టింగ్‌ చేశారు. పోలీసుల నుంచి రహస్య పత్రాలను సేకరించడం ద్వారా...

మధ్యప్రదేశ్ : రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీపై మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నా రక్తాన్ని తాగాలన్నంత ఆగ్రహంతో వుందని వ్యాఖ్యానించారు. కాగా సిధి జిల్లాలోని చుర్హాత్ లో జన్ ఆశీర్వాద్ యాత్ర జరుగుతుండగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై...

తిరుమల : తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుడు ప్రపంచవిఖ్యాతి గాంచాడు. ఆయన విషయంలో ఏం జరిగినా సంచలనమే. శ్రీవారి సేవలు..ఆయన ఆదాయం...నగలు ఇలా ప్రతీదీ శ్రీవారి సంచలనమే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా శ్రీవారి నగల విషయంలో వివాదాస్పద వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆపద మొక్కులవాడి సన్నిధి ఎంతటి రమ్యంగా వుంటుందో..ఆయన విషయంలో వివాదాలు, సంచలనాలకు లోటు...

రోజురోజుకు కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఈరోజు వున్న టెక్నాలజీ రేపటికల్లా పాతదైపోతోంది. సినిమా రంగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు టెక్నాలజీలో రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు మూకీ సినిమా చూడటం పెద్ద సంబరంగా వుండేది. తరువాత మాటలు..ఆ తరువాత రంగులు..స్పోపు, స్పెషల్ ఎఫెక్ట్స్, 70ఎంఎం,బిగ్ స్క్రీన్ ఇలా సినిమా తెర టెక్నాలజీతో అభిమానులను అకట్టుకుంటు మనసులను...

ముంబై : కేంద్ర ప్రభుత్వంపై ప్రముఖ బాలీవుడ్ నటి సంచలన విమర్శలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన వారు దేశాన్ని పాలిస్తున్నారంటూ బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. పౌరహక్కుల నేత వరవరరావుతో పాటు మరికొందరిని కేంద్రం ప్రభుత్వం అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును ఖండించిన నటి స్వర భాస్కర్ కేంద్రంపై నిప్పులు చెరిగింది...

ఉత్తరప్రదేశ్ : ఇస్లాం నియమాల ప్రకారం మహిళలపై జరిగే ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. దారుణమైన హింసలకు ముస్లిం మహిళలు బలైపోతున్నారు. వారి ఆవేదన ఆరణ్య రోదనగా మిగిలిపోతోంది. అసలు ఈ 'నిఖా హలా' అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం..ముస్లిం నియమాలు, ఆచార సంప్రదాయాల ప్రకారం..విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో...

థాయ్ లాండ్ : బ్యాంకాక్ అంటే పర్యాటకులు ఉత్సాహం చూపే ప్రాంతం. భూత స్వర్గంగా పేరొందిని ఈ స్వర్గధామం అత్యంత ప్రమాదంలో పడింది. ఇంతటి సుందర రూపం అయిన బ్యాంకాక్ సముద్రంలో మునిగిపోనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. థాయ్ లాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ ప్రమాదంలో పడిందా? ఏమిటా ముప్పు? ఆ సుందర నగరం త్వరలోనే సముద్రంలో మునిగిపోనుందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు...

కేరళ : ఒకరి కష్టం చూసి చలించిపోయే మనసు అందరికీ వుండదు. అలా స్పందించటనాకి పేద, గొప్న తేడా లేదు. ప్రార్థించే పెదవులు కంటే సాయం చేసే చేతులు మిన్న అని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రూపం మదర్ థెరిసా పలుకులు ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆ మానవతావాది మాటలనే నిజం చేశాడు ఓ యాచకుడు. కష్టంలో వున్న వారికి సహాయం చేసేందుకు కోట్లాది రూపాయలు అక్కరలేదని.....

పశ్చిమ బెంగాల్ : రాజధాని కోల్‌కతాలో పసికందుల మృతదేహాలున్న ప్లాస్టిక్ సంచులు కలకలం సృష్టించాయి. పాలిథిన్‌ కవర్లలో 14 మంది శిశువుల మృతదేహాలున్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానిక హరిదేవ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ సంచులు అక్కడికి ఎలా వచ్చాయి.. ఎవరు తీసుకొచ్చారు.. అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు...

Pages

Don't Miss