ప్రతి మ్యాచ్ కి ముందు జాతీయగీతం

Submitted on 7 November 2019
National anthem before the start of ipl game

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశారు. ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కి ముందు జాతీయ గీతం పాడించాలని కోరారు. ఐపీఎల్ 2020 సీజన్ నుంచే దీన్ని అమలు  చేయాలన్నారు. అంతేకాదు ఐపీఎల్ ఆరంభ వేడుకలు రద్దు చేయడం మంచి నిర్ణయం అని ప్రశంసించారు.

''ఓపెనింగ్ సెర్మిని అవసరం లేదు. దాని అవసరం, విలువ గురించి ఆలోచిస్తుంటాను. బీసీసీఐ మరో పని చేయాలి. ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ముందు జాతీయ గీతాలాపన చేయించాలి. దీని గురించి గతంలోనూ నేను  బీసీసీఐకి లేఖ రాశాను. ఇప్పుడు సౌరవ్ గంగూలీకి రాశాను. సినిమా హాళ్లలో ఇప్పటికీ జాతీయగీతం ప్రదర్శిస్తున్నారనే అనుకుంటున్నా. మన జాతీయ గీతం చూసి గర్వించాలి. మన అద్భుతమైన లీగ్ లో జాతీయగీతం  పాడాలి. ఇండియన్ సూపర్ లీగ్, ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ కు ముందు పాడతారు. అంతెందుకు ఎన్బీఏలోనూ జాతీయగీతం ఆలపిస్తారు'' అని నెస్ వాడియా అన్నారు.

విదేశాల్లో ఐపీఎల్ జట్ల స్నేహపూర్వక మ్యాచ్ లపై నెస్ వాడియా స్పందించారు. ''ఐపీఎల్‌ అనేది భారతదేశ లీగ్‌. విదేశాలకు దానిని విస్తరిస్తే మంచిదే. దీని ద్వారా బీసీసీఐకీ ఎంతో లాభం వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్‌ లీగ్‌లను పరిశీలిస్తే సీజన్‌కు ముందు వారు విదేశాల్లో స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడతారు. దీనివల్ల చూసేవారి సంఖ్య, ఐపీఎల్‌ విలువ పెరుగుతుంది. దీనిని బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటే మంచిది" అని నెస్ వాడియా అభిప్రాయపడ్డారు.

KXIP
Proposal
BCCI
national anthem
ipl game
Ness Wadia
sourav ganguly

మరిన్ని వార్తలు