అమెరికాలో మోడీ అభిమాని హంగామా : ఎలక్షన్ రిజల్ట్స్ చూసేందుకు అన్నంత పనిచేశాడు!

Submitted on 24 May 2019
Narendra Modi Fan In The US Has Booked An Entire Movie Hall Just To Screen Lok Sabha Poll Results

2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. ఒక ఇండియాలోనే కాదు.. విదేశాల్లోని భారతీయులు కూడా అదే ఉత్సాహంతో ఎన్నికల ఫలితాలను ఫాలో అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మోడీ గాలికి.. కూటమి పార్టీలు సైతం పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.

మోడీకి హవా ఇండియాలోనే కాదు.. విదేశాలకు కూడా పాకింది. అమెరికాలో మోడీ డైహార్డ్ అభిమాని ఒకరు అన్నంత పనిచేశాడు. ఇతగాడికి మోడీ అంటే ఎంతో అభిమానం. అందరూ టీవీల్లో ఎన్నికల ఫలితాలను చూస్తుంటే.. ఇతగాడు మాత్రం ఏకంగా మూవీ థియేటర్ మొత్తం బుక్ చేశాడు. అమెరికాలోని మిన్నెపాలిస్, మిన్నెసొటా ప్రాంతంలోని మూవీ థియేటర్ లో లోక్ సభ ఎన్నికల ఫలితాలను తెరపై చూడాలనుకున్నాడు. 

మోడీని ఎంతో అభిమానించే రమేశ్ నూనే అనే ఐటీ ప్రొఫిషనల్ అన్నంత పనిచేసి చూపించాడు. లోక్ సభ ఫలితాలను మూవీ థియేటర్ స్ర్కీన్ పై వీక్షించేందుకు అన్ని టీవీ న్యూస్ ఛానళ్లతో ఒకేచోట క్లబ్ చేసి బిగ్ స్ర్కీన్ గా మార్చేశాడు. అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 9.30 గంటల నుంచి అక్కడి ప్రజలకు ఎన్నికల ఫలితాలను చూసేలా ఏర్పాట్లు చేశాడు. మూవీ థియేటర్ లో ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు 150మందికి టికెట్లు కొనేశాడు.

మూవీ థియేటర్ లో ఒక్కో టికెట్ ధర రూ.వెయ్యి (15 డాలర్లు) వరకు ఉన్నప్పటికీ మోడీపై అభిమానంతో ఇదంతా చేసినట్టు ఓ నివేదిక తెలిపింది. అమెరికాలో ఇతర ప్రాంతాలైన ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ, టెక్సస్, కాలిఫోర్నియాలో కూడా ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టు రిపోర్ట్ వెల్లడించింది. 

Narendra Modi
PM Modi Fan
US
 Entire Movie Hall
 Screen
Lok Sabha Poll Results

మరిన్ని వార్తలు