ట్రంప్ కు పోటీ : మోడీ ఎయిర్ ఇండియా వన్

Submitted on 9 February 2019
 narendra modi air india gets rs1300 cr

 

భారీ రేంజ్ భధ్రత. లేటెస్ట్ టెక్నాలజీ వాడే అమెరికాకే పోటీగా విమానాలను కొనుగోలు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్‌కు పోటీగా ఎయిరిండియా వన్ ‌ను సిద్ధం చేస్తుంది భారత్. ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలు వ్యక్తుల ప్రయాణించేందుకు ఎయిరిండియా హై రేంజ్ సెక్యూరిటీతో కూడిన విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.

భద్రతా విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండే అగ్రదేశం అమెరికా నుంచి విమానాలను తీసుకొచ్చుకునేందుకు సిద్ధమైన ఎయిరిండియా ఒక్క విమానం కోసం రూ.1300కోట్లకు పైగా ఖర్చు చేస్తుందట. ఇందులో ప్రయాణించేది దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి, ఆ తర్వాత ప్రధాన మంత్రి లాంటి వ్యక్తులకు మాత్రమే.

 

ఈ విమానం ఖరీదు : రూ.1,300 కోట్లు

ఈ విక్రయం వల్ల భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధం మరింత బలోపేతమవుతుందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్‌’ పేర్కొంది. పెంటగాన్ అమ్మక వివరాల ప్రకారం.. విదేశీ నియమాలు, జాతీయ భద్రతా విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా అమెరికాను కోరిందట. భారత్ చేసిన ఈ ప్రతిపాదనను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్‌ను అప్పగించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపింది. 

 

ఎయిర్ ఇండియా వన్ స్పెషల్ :

విమానం చుట్టూ భారీ భద్రత ఉంటుంది కదా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి భద్రత తీసుకోవడమెందుకంటే.. ఎవ్వరికీ కనిపించనంత దూరంలో ఉన్న శత్రువులను టార్గెట్ చేసి భుజం మీద పెట్టుకుని పేల్చే మిస్సైల్‌లను కూడా పసిగట్టేస్తాయి. అంతేకాదు ఆ సమాచారాన్ని వెంటనే పైలట్‌కు తెలియజేస్తాయి. 

 

అమెరికా అధ్యక్షుడి అధికార విమానం ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌’ తరహా భద్రతా వ్యవస్థలు ‘ఎయిర్‌ ఇండియా వన్‌’లోనూ సమకూరినట్లవుతుందని పెంటగాన్‌ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్‌లకు ప్రాణహాని ఉందని ఇటువంటి భద్రతా చర్యలు తీసుకుంటే మిస్సైల్‌ల  వంటి వాటిని కూడా సేఫ్‌గా ఎదుర్కోవచ్చు. 

కోహ్లీ బాటలో సింధు: కోట్ల విలువైన భారీ కాంట్రాక్ట్ కొట్టేసింది!!

 

 

PM
Narendra Modi
President

మరిన్ని వార్తలు