అమరావతిపై జగన్ కల నెరవేరింది : నారా లోకేష్

Submitted on 19 July 2019
nara lokesh hot comments on cm Jagan on Amaravati

అమరావతి : ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకు పడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి వరల్డ్ బ్యాంకు తప్పుకోవటంపై సెటైర్లు వేశారు. " జగనన్న వచ్చారు, వరల్డ్ బ్యాంక్ పోయింది. జగన్ గారి కల నెరవేరింది. మొత్తానికి అమరావతిని పడగొట్టేసారు. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇకసెలవంది. బాబుగారి హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయ్యింది"  అంటూ ట్వీట్ చేశారు.  

అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే  కార్యాచరణలో జగన్ గారు మొదటి అడుగు విజయవంతంగా వేశారని లోకేష్ ఆరోపించారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో అని సీఎం జగన్ తీరుపై లోకేష్ తీవ్రంగా విమర్శించారు. 

 

Andhra Pradesh
CM YS Jagan Mohan Reddy
Nara Lokesh
TDP
world bank
Amaravathi

మరిన్ని వార్తలు