ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి : వల్లభనేని వ్యాఖ్యలపై లోకేష్ స్పందన

Submitted on 15 November 2019
Nara Lokesh criticizes Vallabhaneni Comments

వల్లభనేని..సిగ్గుంటే.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి..ఆస్తులను కాపాడుకొనేందుకే వంశీ టీడీపీని వీడారు..అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వల్లభనేని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వారం రోజుల క్రితం వత్తిడి ఉందని తనతో మాట్లాడినట్లు చెప్పారు. ఇప్పుడు యూ టర్న్..జే టర్న్ తీసుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఒకరిద్దరి పార్టీని వీడినంత మాత్రానా..ఎలాంటి నష్టం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే..వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆయనకు షోకాజ్‌ నోటీసు విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌పై వంశీ చేసిన విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టినట్టు తెలుస్తుంది.

పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చిన వంశీ..టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తానేమీ కేసులకు భయపడడం లేదని, లావాదేవీల కోసం సీఎం జగన్ పక్కన చేరడం లేదన్నారు. వర్ధంతికి..జయంతికి తేడా తెలియని వాళ్లు పార్టీని నడుపుతున్నారంటూ పరోక్షంగా లోకేష్‌పై విమర్శలు గుప్పించారు వంశీ. అలాంటి వాళ్లు తమను అంటే పడాలా అంటు నిలదీశారు. తమను బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో ఉంచుకుంటారా అంటూ మరోసారి ప్రశ్నించారు. తనకు వారసత్వ రాజకీయాలు అంటే..మోజు లేదని వంశీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఘాటుగానే రెస్పాండ్ అవుతున్నారు.

Nara Lokesh
criticizes
Vallabhaneni
Comments

మరిన్ని వార్తలు