సుధీర్ హీరో-నాని విలన్

Submitted on 20 February 2019
Nani, Sudheer Babu Multi Starrer-10TV

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో జెర్సీ మూవీ చేస్తున్నాడు. విక్రమ్ కె.కుమార్‌తో చెయ్యబోయే కొత్త సినిమాకి ఇటీవలే కొబ్బరికాయ కొట్టారు. ఇప్పుడు దాని తర్వాతి సినిమాని కూడా లైన్‌లో పెట్టేసాడు నాని. అష్టాచమ్మాతో తనకి బ్రేక్ ఇచ్చి, జెంటిల్‌మన్‌తో మరో మెట్టు ఎక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటితో కలిసి ముచ్చటగా మూడోసారి పనిచెయ్యబోతున్నాడు నాని. అష్టాచమ్మా, జెంటిల్ మన్, అమీ తుమీ, సమ్మోహనం సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ వే క్రియేట్ చేసుకున్న మోహన కృష్ణ, ఒక మల్టీ స్టారర్ మూవీ చెయ్యబోతున్నాడు. ఒక హీరోగా నాని ఫిక్స్ కాగా, మరో హీరోగా సుధీర్ బాబుని సెలక్ట్ చేసారు. దిల్ రాజు నిర్మాత.

సమ్మోహనంతో సుధీర్‌కి డీసెంట్ హిట్ ఇచ్చాడు మోహనకృష్ణ.. సుధీర్ ప్రస్తుతం పుల్లెల గోపిచంద్ బయోపిక్ చెయ్యబోతున్నాడు. నాని, సుధీర్‌ల కోసం ఒక వెరైటీ స్టోరీ రెడీ చేసాడట ఇంద్రగంటి. నాని క్యారెక్టర్‌లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయట. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందబోయే ఈ సినిమా త్వరలో స్టార్ట్ కానుంది. 
 

Natural Star Nani
Sudheer Babu
Dil Raju
Mohan Krishna Indraganti

మరిన్ని వార్తలు