'తుగ్లక్‌'గా మారుతున్న నందమూరి హీరో

Submitted on 22 March 2019
Nandamuri Kalyan Ram Thuglak With Debut Director

ఇటీవల 118 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్‌ కు సినీ కెరీర్‌లో ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా మూడు చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేశాడు. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు మల్లిడి వేణు డైరెక్షన్‌లో సోషియే ఫాంటసీ సినిమాలో నటించేందుకు కల్యాణ్‌ రామ్ ఓకె చెప్పారన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తుగ్లక్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.
Read Also : బుల్లితెర నుంచి వెండితెరకి.. హీరోగా ప్రదీప్ ఎంట్రీ

ఈ కథలో తుగ్లక్‌ మళ్లీ పుట్టడం లేదా ఆయన మళ్లీ వస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన అంశం మిలితమై ఉందట. ఈ కొత్తదనం నచ్చే కల్యాణ్‌ ఈ స్టోరీకి ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఫాంటసీ సినిమా కావటంతో బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందని తెలుస్తోంది. అందుకే రిస్క్‌ లేకుండా ఈ సినిమాను తన సొంత బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట కల్యాణ్‌ రామ్‌. మల్లిడి వేణు సినిమాను ముందుగా అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట. కానీ ఫైనల్‌ కల్యాణ్ రామ్‌ ఓకె చెప్పటంతో ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.
Read Also : చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి

Nandamuri Kalyan Ram
Thuglak
2019

మరిన్ని వార్తలు