పగలు ఆడపిల్ల-రాత్రైతే పాముపిల్ల

Submitted on 12 February 2019
Nagakanya Official Telugu Trailer-10TV

జై, రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్ష్మీ శరత్ కుమార్ మెయిన్ లీడ్స్‌గా, ఎల్.సురేష్ డైరెక్షన్‌లో, జంబో సినిమాస్ బ్యానర్‌పై.. శ్రీధర్ అరుణాచలం ప్రొడ్యూస్ చేస్తున్న తమిళ్ మూవీ... నీయా 2.. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని.. నాగకన్య పేరుతో తెలుగులో రిలీజ్ చెయ్యబోతున్నారు. మొన్ననే రాయ్ లక్ష్మీ, వరలక్ష్మీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. ఇప్పుడు నాగకన్య తెలుగు ట్రైలర్ విడుదల చేసింది. నాగదోషం, పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతుందీ సినిమా.. విజువల్స్, గ్రాఫిక్స్, ఆర్ఆర్ బాగున్నాయి.

ట్రైలర్‌లో జై.. రాయ్, కేథరిన్ అండ్ వరలక్ష్మీ ముగ్గురితోనూ రొమాన్స్ చేసాడు. ముగ్గుర్నీ పెళ్ళి చేసుకున్నట్టు చూపించి, సస్పెన్స్ క్రియేట్ చేసారు.
మార్చిలో నాగకన్య తెలుగు, తమిళ్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : షబీర్, కెమెరా : రాజీవ్ మీనన్, ఎడిటింగ్ : గోపీకృష్ణ.

వాచ్ నాగకన్య ట్రైలర్... 

Jai
RAAI LAXMI
Catherine Tresa
Varalaxmi Sarathkumar
Jumbo Cinemas
L Suresh


మరిన్ని వార్తలు