ఈ సినిమా నాకింకో జ్ఞాపకం: నాగ చైతన్య

Submitted on 7 December 2019
NAGA chaithanya speech in venky mama pre release event

మేనమామ, మేనల్లుడు వెంకటేశ్, నాగ చైతన్య మామా అల్లుళ్లుగా తెరకెక్కిన చిత్రం 'వెంకీ మామ'. డిసెంబరు 13న విడుదల కానున్న సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌ను డిసెంబర్ 7న నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని లేక్ వ్యూ క్లబ్ వేదికగా జరిగిన కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. పాటలు, హీరోయిన్ల స్టెప్పులు, వెంకీ డైలాగ్ లకు స్టేజ్ ముందు జనం ఫుల్ జోష్ లో కనిపించారు. 

బిగ్ బాస్ తర్వాత యాంకరింగ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీ ముఖి చక్కటి మాటలతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో హీరోయిన్లు, డైరక్టర్ మాట్లాడిన తర్వాత అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగ చైతన్య మైక్ అందుకున్నారు. దగ్గుబాటి, అక్కినేని అభిమానులను విష్ చేసి మొదలుపెట్టిన చైతూ మామను పొగడ్తలతో ముంచెత్తాడు. 'ఈ సినిమా నాకు మనం సినిమా ఎంత స్పెషలో ఇది కూడా అంత స్పెషల్.. సినిమా కాదు. ఓ జ్ఞాపకం'గా ఫీలవుతున్నా అన్నాడు. 

> ఈ సినిమా ఎంత స్పెషలో ఖమ్మం కూడా అంతే స్పెషల్
> సినిమా షూటింగ్‌లో కెమెరా ముందు ఒక మామ(వెంకటేశ్) కెమెరా వెనుక ఓ మామ(సురేశ్ బాబు) బాగా చూసుకున్నారు. 
> సినిమాలో మామ అల్లరి మామూలుగా ఉండదు.
> ఒక్కో డైరక్టర్ కంటెంట్ పట్టుకుంటారు. వేరొకరు కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకుంటారు. డైరక్టర్ బాబీ కంటెంట్, కమర్షియల్ వాల్యూస్ కలిపి సినిమా తీశాడు. 
> కెరీర్ లో ఇంత త్వరగా ఇలాంటి మిలటరీ క్యారెక్టర్ వస్తుందనుకోలేదు. థ్యాంక్యూ. 
> హీరోయిన్స్ ఇద్దరూ బాగా చేశారు. పాయల్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాక్ ఉంది. బాగా చేశాం. 
> ఆడియన్స్ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. డిసెంబరు 13న కలుద్దాం.

చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం డిసెంబరు 4న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరిగింది. కాగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ఖమ్మంలో నిర్వహించారు. 

Naga Chaithanya
Venky Mama
Pre Release Event
chaithu

మరిన్ని వార్తలు