టీజర్ వచ్చేస్తుంది

Submitted on 12 February 2019
Naga Chaitanya MAJILI Movie Teaser on feb 14th-10TV

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న సినిమా.. మజిలీ.. దేర్ లవ్, దేర్ ఈజ్ పెయిన్ అనేది ట్యాగ్ లైన్.. లవర్స్ డే కానుకగా మజిలీ టీజర్ రిలీజ్ చెయ్యనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ అప్‌డేట్ ఇస్తూ, న్యూ పోస్టర్ రిలీజ్ చేసారు. చైతు, సమంత ఇద్దరూ బస్ ఫ్రంట్ డోర్‌లో నిలబడి ఉన్నారు. చై, ఫీల్‌తో శ్యామ్‌ని చూస్తూ ఉన్న పోస్టర్ సింపుల్‌గా, చూడ్డానికి బాగుంది. ఫిబ్రవరి 14 ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మజిలీ టీజర్ రిలీజ్ కానుంది. 


మజిలీలో చైతు మాజీక్రికెటర్‌గా, సమంత రైల్వే క్లర్క్‌గా కనిపించబోతుందని తెలుస్తుంది. చీటికీ మాటికీ గొడవపడే భార్య, భర్తలుగా చై, శామ్ నటిస్తున్నారని తెలుస్తుంది. దివ్యాంశ కౌశిక్ సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్, చైతు, సమంత కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మజిలీపై మంచి అంచనాలున్నాయి. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. యుద్ధం శరణం, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలతో నిరాశపడ్డ చైతు, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఏప్రిల్ 5 న మజిలీ విడుదలవుతుంది.

Naga Chaitanya
Samantha
Divyansha Kaushik
Gopi Sundar
Sahu Garapati
Harish Peddi
Shiva Nirvana


మరిన్ని వార్తలు