నడిగర్ సంఘం ఎన్నికలు రద్దు

Submitted on 19 June 2019
Nadigar Sangam elections cancelled

ఈనెల 23న జరగాల్సిన నడిగర్ సంఘం ఎన్నికలు రద్దవడం కోలీవుడ్ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలు వాయిదా వెయ్యమని మద్రాస్ హైకోర్ట్, మొత్తానికి రద్దు చేస్తున్నామని నడిగర్ సంఘం తేల్చి చెప్పడంతో, తమిళ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా జరిగే నడిగర్ సంఘం ఎలక్షన్స్ క్యాన్సిల్ అయినట్టే అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, జూన్ 23న జరగాల్సిన నడిగర్ సంఘం ఎన్నికలను ఎంజిఆర్ జానకి కాలేజ్‌లో నిర్వహించాలనుకున్నారు.

ఎక్కువగా పబ్లిక్ తిరిగే ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తే ట్రాఫిక్‌ జామ్ అవుతుందని, ఎన్నికలను వాయిదా వెయ్యమని మద్రాస్ హైకోర్ట్ చెప్పింది. ఇదిలాఉంటే విశాల్ బృందం తమ ఓట్లను తొలగించిందని 61 మంది సభ్యులు రిజిస్టార్‌కు ఫిర్యాదు చెయ్యడంతో, ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు సొసైటీ రిజిస్టార్ ప్రకటించారు. దీంతో ఎన్నికల సమయంలో ఈ 61మంది మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదని విశాల్ టీమ్ ప్రశ్నిస్తుంది.

ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నాయి. నడిగర్ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు వినతిపత్రం అందచేసింది విశాల్ బృందం.. నడిగర్ సంఘం ఎన్నికలు రద్దవడం కోలీవుడ్‌లో కలకలం రేపుతుంది. 

Nadigar Sangam
Nadigar Sangam elections cancelled
Kollywood

మరిన్ని వార్తలు