మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల

Submitted on 15 March 2019
Naa Gundello Lyrical Song Released From Majili Movie

‘నిన్నుకోరి’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనకు అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రియల్ లైఫ్ కపుల్స్ సమంత, నాగచైతన్య నటిస్తున్న చిత్రం 'మ‌జిలి'. ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఈ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ...వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. ఈ మూవీ విడుదల తేదీని కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు.
Read Also: అలియా భ‌ట్ అర్ధ‌రాత్రి బ‌ర్త్‌డే వేడుకల‌ు

ఇప్ప‌టికే టీజ‌ర్‌తో పాటు రెండు సాంగ్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా ‘నా గుండెల్లో’ అంటూ మూడో సాంగ్ కూడా విడుద‌ల చేశారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది. నాగ చైతన్య దివ్యాన్ష కౌశిక్‌లపై చిత్రీకరించిన ఈ సాంగ్‌కి గోపీ సుందర్ స్వరాలను సమకూర్చగా.. రామ్ బాబు గోసల సాహిత్యం అందించారు. యాజిన్ నిజార్, ఈ బ్యూటిఫుల్ సాంగ్‌ను నికితా గాంధీ ఆలపించారు. 

Naa Gundello Song Released
Majili Movie
Divyansha Kaushik
Naga Chaithanya

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు