బుర్రకి పైత్యం వస్తే : నన్నెందుకు కన్నారు అంటూ కోర్టుకెళ్లిన కొడుకు

Submitted on 7 February 2019
This Mumbai Man Wants To Sue His Parents For Giving Birth To Him

ముంబై: పిల్ల వచ్చి గుడ్డును వెక్కిరించిన చందంగా ఓ వ్యక్తి.. నా అనుమతి లేకుండా ఎలా జన్మనిస్తారని ప్రశ్నించడమే కాకుండా.. కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పిల్లలను కని పెంచి.. ప్రయోజకులను చేస్తే తమకు గొప్ప పేరు వస్తుందని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. కానీ.. ఆ పిల్లలే పెరిగిన తర్వాత.. నన్ను ఎందుకు భూమి మీదకు తీసుకువచ్చావని కోర్టుకెక్కితే వాళ్ల పరిస్థితి ఏంటి. అలాంటి పరిస్థితే ఎదురైంది ముంబైలోని ఓ కుటుంబానికి.

 

రాఫెల్‌ శామ్యూల్‌(27).. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. తన అనుమతి లేకుండా ఎందుకు జన్మనిచ్చారని తల్లిదండ్రులపై దావా వేసేందుకు సిద్దమయ్యాడు. మానవజాతిపై నమ్మకం లేని ఈ ప్రబుద్దుడు.. పిల్లలు కనడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. పిల్లలను కనడం వల్ల వారు పెరిగి భూమిని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. బిడ్డలకు జన్మనివ్వడం తప్పంటున్న శామ్యూల్‌.. పిల్లలను ఈ భూమి మీదకు బలవంతంగా తీసుకురావడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఇది చాలా తప్పు అని అంటున్నాడు. అలాగే.. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినవన్నీ చేయాల్సిన పని లేదంటున్న శామ్యూల్‌.. కానీ ఎవరైనా నిజాయితీగానే మనిషికి గౌరవమివ్వాలంటాడు. తాను మాత్రం తల్లిదండ్రులను ప్రేమిస్తున్నానని.. తల్లిదండ్రులకు తనకు మధ్య మంచి అనుబంధమే ఉందంటున్నాడు. అయినా సరే, తల్లిదండ్రులు వారి ఆనందం కోసం మాత్రమే పిల్లలకు జన్మనిస్తారని చెబుతాడు.

 

తన జీవితం అద్భుతంగా ఉందంటున్న శామ్యూల్‌.. తన వల్ల మరొకరికి హానీ కలగడం ఇష్టం లేదని చెబుతున్నాడు. అంతేకాదు తనకు నిహిలాండ్‌ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌లో.. పిల్లలు ఈ ప్రపంచంలో ఎలా ఉండాలనే దానిపై ప్రసంగాలు పోస్ట్ చేస్తుంటాడు. పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ ఈ భూమిపై నేరాలు పెరుగుతూ ఉంటాయని అభిప్రాయపడుతున్నాడు. మొత్తానికి ఎన్నో కేసులను చూశాం కానీ తాజాగా శామ్యూల్‌ కేసు చూస్తుంటే విచిత్రంగా కనిపిస్తోంది. మరి కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరిస్తుందా. స్వీకరిస్తే ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Mumbai Man
Wants To Sue His Parents
For Giving Birth To Him
Raphael Samuel
antinatalist
arrest parents

మరిన్ని వార్తలు