ఊపు ఊపుతున్న ముంబై, దిల్లీ ది కుడియా సాంగ్

Submitted on 24 April 2019
Mumbai Dilli Di Kudiyaan from Student Of The Year 2-10TV

బాలీవుడ్‌లో 2012లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిలిం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్‌గా, పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' మూవీ రూపొందుతుంది. టైగర్ ష్రాఫ్, అనన్య పాండే, తారా సుతారియా మెయిన్ లీడ్స్‌గా నటించారు. రీసెంట్‌గా ఈ మూవీలోని 'ముంబై, దిల్లీ ది కుడియా' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్‌లో టైగర్ స్టెప్స్ ఇరగదీసాడు. అనన్య, తారా ఇద్దరూ చాలా గ్లామర్‌గా ఉన్నారు. విశాల్-శేఖర్ సాంగ్స్ కంపోజ్ చేసారు. వాయు లిరిక్స్ రాయగా, దేవ్ నాగ్, పాయల్ దేవ్, విశాల్ దద్లాని పాడారు.
Also Read : మహర్షి : పదర పదర లిరికల్ సాంగ్

రెమో డిసౌజా కొరియోగ్రఫీ చేసాడు. ధర్మా ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. మే 10న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' రిలీజ్ కానుంది.
ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ : సలీమ్-సులేమాన్, సినిమాటోగ్రఫీ : రవి కె.చంద్రన్, ఎడిటింగ్ : రితేష్ సోనీ.

వాచ్ వీడియో సాంగ్.. 

Tiger Shroff
Tara Sutaria
Ananya Pandey
Vishal
Shekhar
Dharma Productions
Punit Malhotra

మరిన్ని వార్తలు