బద్రీనాథ్ ను దర్శించుకున్న ముఖేశ్ అంబానీ : రూ.2 కోట్లు విరాళం

Submitted on 25 May 2019
Mukesh Ambani  visited Badrinath Temle, has donated Rs 2 crore

రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ బద్రీనాథుడ్ని దర్శించుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయాన్ని శనివారం (మే 25)న ముఖేశ్ అంబాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ విరాళాన్ని అందజేశారు. బద్రీనాథ్ కేదార్ నాథ్ ఆలయ కమిటీకి ఆయన రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. 
 
బద్రీనాథ్‌ ఆలయంలో ప్రార్థనలు చేసిన అంబానీ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. గర్భాలయంలో వేద పండితులు చదివిన భగవద్గీత ప్రవచనాలను శ్రద్ధగా అలకించారు. అనంతరం తన తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో తమిళనాడులోని శాండిల్‌వుడ్ ఆలయంలో భూమి కొనుగోలుకు అంబానీ హామీ ఇచ్చారు. దీంతో ఆలయ కమిటీ సంతోషం వ్యక్తంచేసింది. 
 

uttarakhand
Mukesh Ambani visited Badrinath Teml
has donated Rs 2 crore

మరిన్ని వార్తలు