విజయ్ శంకర్‌ వరల్డ్ కప్ టీంలో ఎందుకంటే..

Submitted on 16 April 2019
msk prasad says, reason behind vijay shankar selection

భారత్ తరపున ప్రపంచ కప్‌లో ఆడాలనేది టీమిండియాలో ప్రతి క్రికెటర్ కల. ఆ అదృష్టం తనను వరించాలని ఎన్నో కలలు కంటారు. కానీ, సెలక్టర్లు తమకు కావలసిన టాలెంట్‌ను బట్టే జట్టు కూర్పు ఎంపిక చేస్తారు. మరి ఏప్రిల్ 15సోమవారం విడుదల చేసిన ప్లేయర్ల జాబితాను బట్టి రాయుడు, పంత్‌లను పక్కకు పెట్టేసి యువ  క్రికెటర్ విజయ్ శంకర్‌కు అవకాశమెందుకిచ్చారు. 

జట్టు ప్రకటన తర్వాత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విజయ్ శంకర్ ఎంపిక గురించి ఇలా మాట్లాడాడు. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కోసం ఎన్నో పరిశీలనలు చేశాం. దినేశ్ కార్తీక్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండేలపై ప్రయోగాలు చేశాం. విజయ్ శంకర్‌ను కూడా ప్రయోగించి  చివరికి అతనినే ఖరారు చేశాం'

శంకర్ బౌలింగ్ చేయగలడు, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. ఫీల్డింగ్‌లోనూ చురుకుగా స్పందిస్తున్నాడు. అందుకే అతనిని ఎంపిక చేశాం. చాలా వరకూ అతను నాల్గో స్థానం ప్లేయర్‌గా ఆడతాడనే నమ్మకంతోనే ఉన్నాం' అని జట్టు ప్రకటన తర్వాత ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. 

టీమిండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ

msk prasad
Vijay Shankar

మరిన్ని వార్తలు