ధోనీ వస్తున్నాడు.. IPL 2021 కూడా ఆడతాడు : CSK ఓనర్

Submitted on 19 January 2020
MS Dhoni will play for Chennai Super Kings in IPL 2021, confirms N Srinivasan

వందల రూమర్లు.. వేల అనుమానాలు ధోనీ మళ్లీ మ్యాచ్‌కు వస్తాడా అనే సందేహాలు పటాపంచలు చేస్తూ ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ యజమానికి శ్రీనివాసన్ తెలిపాడు. ఈ సంవత్సరమే కాదు 2021లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీయే ఉంటాడని శనివారం ఆయన స్పష్టం చేశాడు. 

ఫ్రాంచైజీ సస్సెండ్ అయిన రెండేళ్లు మినహాయించి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఆడుతూనే ఉన్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితా ప్రకటించినప్పటి నుంచి ధోనీ పేరు లేకపోవడంతో ఇక ధోనీ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. అదే రోజు ఆశ్చర్యంగా ధోనీ జార్ఖండ్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. 

'ఈ సంవత్సరం ధోనీ.. జట్టుకు ఆడుతున్నాడు. వచ్చే ఏడాది వేలంలో ఉంటాడు. మళ్లీ అతణ్ని కొనుగోలు చేస్తాం' అని చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ చెప్పాడు. 'బీసీసీఐ ఉన్నతాధికారి ధోనీతో సెంట్రల్ కాంట్రాక్ట్ గురించి  చర్చించారు. సెప్టెంబరు 2019నుంచి ఏ గేమ్ ఆడకపోవడంపై ధోనీ పేరు కాంట్రాక్ట్‌లో ఉండదని ఆయనకు ముందుగానే తెలుసు. అందుకే కాంట్రాక్ట్ లో ధోనీ పేరు లేదు' అని సమాచారం. 

MS Dhoni
chennai super kings
IPL 2021
N Srinivasan
IPL
IPL 2020
CSK
dhoni

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు