ధోనీ బ్యాటింగ్‌ చూసి భయం వేసింది: కోహ్లీ

Submitted on 22 April 2019
MS Dhoni batting give us a massive scare, says Kohli

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చూసి భయమేసిందని తెలిపాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఆ ఓవర్లో కావలసిన 26పరుగులు పూర్తి చేస్తాడేమోననిపించింది. 48 బంతుల్లో 84పరుగులు చేసిన ధోనీ.. ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. 

'స్పల్ప వ్యత్యాసంతో మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. చాలా అవకాశాలను వదిలేసుకున్నాం. మహీ మాత్రం తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మేమంతా అతని బ్యాటింగ్‌కు భయపడిపోయాం. చివర్లో మాత్రం ఊహించిందే జరిగింది'

'లీగ్‌లో ముగిసిన 9గేమ్‌లలో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే ఓడిపోయాం. ఈ మ్యాచ్‌లోనూ ధోనీ అంతటి పనే చేశాడు. 19ఓవర్ల వరకూ బాగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనుకుంటే మహీ ఎదురుదాడి మమ్మల్ని భయానికి గురిచేసింది' అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో కోహ్లీ వివరించాడు. 

MS Dhoni
Virat Kohli
IPL 2019
IPL 12
CSK
rcb
royal challengers bangalore
chennai super kings

మరిన్ని వార్తలు