ప్రభాస్ Mr.పర్‌ఫెక్ట్ కథ కాపీ - కన్ఫామ్ చేసిన కోర్ట్

Submitted on 22 April 2019
Mr.Perfect Movie Complete Copy from Syamala Devi's Novel

సినిమా ఇండస్ట్రీలో క్రియేటివిటీ విషయంలో కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు Mr.పర్‌ఫెక్ట్ కథ కాపీనే అంటూ కోర్టు తీర్పునివ్వడం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.. వివరాల్లోకి వెళితే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దశరథ్ డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మించిన Mr.పర్‌ఫెక్ట్ సినిమా 22-04-2011 లో రిలీజ్ అయ్యింది. కాజల్, తాప్సీ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా హిట్ అయ్యింది. రిలీజ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత, టీవీలో సినిమా చూస్తూ, తను రాసిన 'నా మనసు కోరింది నిన్నే' అనే నవలను కాపీ కొట్టి, Mr.పర్‌ఫెక్ట్ తీశారని ఆగ్రహం వ్యక్తం చేసారు రచయిత ముమ్ముడి శ్యామలా దేవి. ఈ కథపై  శ్యామలా దేవి కోర్ట్‌‌‌‌లో కేసు వేశారు. కొద్దికాలంగా కేసు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది.

Mr.పర్‌ఫెక్ట్ సినిమాలో కథ, మాటలు, సన్నివేశాలు.. (దాదాపు 30 సీన్స్ పైనే) శ్యామలా దేవి రాసిన నవలలోనివే అని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. 2010లో శ్మామల దేవి  'నా మనసు కోరింది నిన్నే' నవల రాసారు. టీవీలో చూసే వరకూ తన నవలని కాపీ చేశారని తెలియదన్నారు ఆమె. దిల్ రాజుని కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. రచయిత సంఘంలో కంప్లైంట్ చేస్తే.. 2009 లోనే కథ రిజిస్టర్ చేయించినట్టు చూపించడానికి దశరథ్ తప్పుడు ఆరోపణలు చేశాడని గుర్తు చేశారు. తప్పకుండా దిల్ రాజు దగ్గరి నుంచి నష్ట పరిహారం వసూలు చేస్తానని రచయిత శ్యామలా దేవి అంటున్నారు. 22-04-2019 నాటికి Mr.పర్‌ఫెక్ట్ రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా కోర్టు తీర్పునివ్వడం విశేషం. శ్యామలా దేవి వ్యాఖ్యలపై Mr.పర్‌ఫెక్ట్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Mr.Perfect Allegation
Prabhas
Dasaradh
Dil Raju

మరిన్ని వార్తలు