మూడోసారీ ముంచేసాడుగా

Submitted on 15 February 2019
Mr. Majnu Closing Collections-10TV

అక్కినేని అఖిల్,   నిధి అగర్వాల్ జంటగా, తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన మిస్టర్ మజ్ను.. జనవరి 25న రిలీజ్ అయ్యింది. అఖిల్, హలో సినిమాలకంటే బెటర్ అనే టాక్ రావడంతో అఖిల్ అండ్ అక్కినేని అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కట్ చేస్తే, కలెక్షన్‌లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. మూవీ యూనిట్ సక్సెస్ టూర్ ప్లాన్ చేసినా, రెస్పాన్స్ అయితే రాలేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. దాదాపు రూ. 22 కోట్ల బిజినెస్ జరుపుకున్న మిస్టర్ మజ్ను క్లోజింగ్ కలెక్షన్స్ (షేర్) ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి..

నైజాం : రూ. 3.90 కోట్లు
సీడెడ్ : రూ. 1.48 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 1.31 కోట్లు
గుంటూరు : రూ. 1.20 కోట్లు
ఈస్ట్ : రూ. 0.72 కోట్లు
వెస్ట్ : 0.58 కోట్లు

కృష్ణా : రూ. 0.82 కోట్లు
నెల్లూరు : రూ. 0.41 కోట్లు
ఏపీ, తెలంగాణా : 10.42 కోట్లు
కర్ణాటక : రూ. 1.15 కోట్లు
ఓవర్సీస్ : రూ. 0.75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : రూ. 0.50 కోట్లు..
టోటల్ : రూ. 12.82 కోట్లు..

రూ. 22 కోట్ల బిజినెస్ చేస్తే, వసూలు చేసింది  రూ. 12.82 కోట్లు మాత్రమే.. ఈ లెక్కన ముచ్చటగా మూడోసారి కూడా బయ్యర్లని ముంచేసాడు అఖిల్..

Mr. Majnu
Akhil Akkineni
Nidhi Agarwal
Thaman S
BVSN Prasad
Venky Atluri

మరిన్ని వార్తలు