నాపై కుట్ర జరిగింది : మంత్రి గంగుల కమలాకర్

Submitted on 17 November 2019
MP Sanjay - Collector Sarfaraz Conversation audio viral

కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌  అహ్మద్‌- బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఆడియో టేప్‌ లీకైంది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ కరీంనగర్ పాలిటిక్స్‌ హాట్ టాపిక్‌గా మారింది. ఆడియో లీక్‌పై బీజేపీ-టీఆర్ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన ఫోన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్‌ చేసిందని బండి సంజయ్‌ ఆరోపిస్తుంటే తమకేం సంబంధం లేదని మంత్రి గంగుల కమలాకర్‌ క్లారిటీ ఇచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో  ఈ సంభాషణ  జరిగింది.

గత అ సెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా అప్పటి బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్ తో కలిసి కుట్ర చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు.  గంగులను డిస్‌క్వాలిఫై చేసేందుకు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌, కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ మధ్య జరిగిన ఫోన్‌కాల్‌ ఆడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎన్నికల కమీషన్ విధించిన పరిమితికి మించి గంగుల ఎన్నికల్లో ఖర్చు పెట్టారని దాని ఆధారంగా  గంగుల కమాలకర్ పై అనర్హత వేటు వేయాలని...ఆ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ హై కోర్టులో కేసు వేశారు. అది ప్రస్తుతం విచారణలో ఉంది. గంగుల కమాలకర్ ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలు బండి సంజయ్ , కలెక్టర్ కి ఇచ్చారని వారిద్దరూ కలిసి గంగులపై వేటు పడేలా కుట్రచేశారని  గంగుల ఆరోపిస్తున్నారు. కుట్ర  విషయమై గంగుల కమాలకర్ మాట్లాడుతూ....కలెక్టర్‌ హోదా అనేది ప్రభు త్వం, రాజ్యాంగ పరిధిలో ఉంటుందని, కేబినెట్‌ నిర్ణయాలు, ప్రభుత్వ రహస్యాలు ఎవ్వరితోనూ పంచుకోకూడదన్నారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు కలెక్టర్‌ ఎన్నికల అధికారి హోదాలో ఉన్నందున, ఓ అభ్యర్థి పోటీలో ఉన్నప్పుడు మరో అభ్యర్థికి రహస్యాలు చెప్ప డం రాజ్యాంగ ఉల్లంఘనగానే భావించాల్సి ఉంటుందన్నారు. 

కలెక్టర్ వివరణ
ఎంపీ బండి సంజయ్ తో తాను మాట్లాడింది వాస్తవమేనని కలెక్టర్ సర్ఫ్ రాజా అహ్మద్ అంగీకరించారు. కాకపోతే ఎనిమిది నిమిషాలు మట్లాడిన ఆడియోను  కేవలం 1-30 నిమిషాలకు కుందించారని చెప్పారు. బండి సంజయ్ నెంబరు తనవద్ద లేదని, వేరే వాళ్ల నెంబరుతో సంజయ్ మాట్లాడారని తెలిపారు.   పూర్తిఆడియో తనవద్ద ఉందని, దాన్నిమీడియాకు విడుగదల చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని స్పష్టం చేశారు.

Telangana
Karimnagar
MP Bandi Sanjay
gangula kamalakar
audio clip
viral

మరిన్ని వార్తలు