తుపాకీ గురిపెట్టి..బైక్‌పై tik tok వీడియో: యువకుల తిక్క కుదిర్చిన పోలీసులు    

Submitted on 20 November 2019
MP: 2 residents of Malhargarh

టిక్ టాక్ పిచ్చి పీక్ లెవెల్ కు వెళ్లిపోతోంది. దీంతో ప్రాణాలో పోగొట్టుకుంటున్న ఘటనలు..కుటుంబాల్లో టిక్ టాక్ వీడియోలు చిచ్చు పెడుతన్నాయి. పచ్చని కాపురాలుకూలిపోతున్నాయి. అయినా ఈ టిక్ టాక్ పిచ్చి మాత్రం తగ్గటంలేదు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఓ చేత్తో తుపాకీ గురి పెట్టి చూపిస్తూ టిక్ టాక్ వీడియో తీసిన ఇద్దరు యువకులకు పోలీసులు షాక్ ఇచ్చారు. 

వివారాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ నగరంలోని మల్‌హర్‌ఘడ్ జరిగింది. మల్‌హర్‌ఘడ్ ప్రాంతానికి చెందిన రాహుల్, కన్హయ్యలిద్దరూ స్నేహితులు. టిక్ టాక్ వీడియోలు చేసి ఎక్కువమంది నెటిజన్ల కామెంట్లు, లైక్‌లు పొందాలని ఓ స్నేహితుడి వద్ద నుంచి తుపాకీ తీసుకున్నారు. ఇద్దరు యువకులు బైక్‌‌ను వేగంగా నడుపుతూ, తుపాకీ గురి చూపిస్తూ టిక్ టాక్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ అయింది. 

అది కాస్తా పోలీసుల దృష్టికి రావటం..పైగా ఈ వీడియోను తమ పోలీసుస్టేషను పరిధిలోనే షూట్ చేశారని తేలడంతో పోలీసులు రాహుల్, కన్హయ్యలను అరెస్టు చేశారు. టిక్ టాక్ వీడియో చేసేందుకు తుపాకిని రూ.25 వేలకు కొన్నట్లుగా యువకులు పోలీసులకు తెలిపారు.

ఈ సందర్బంగా మాండ్ సౌర్ ఎస్పీ మాట్లాడుతూ..ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి వారి నుంచి పిస్టల్, బుల్లెట్లు స్వాధీనంచేసుకున్నామని తెలిపారు.  పిల్లలు ఏం చేస్తున్నారోనని..ముఖ్యంగా సోషల్ మీడియాలో పిల్లలు ఎలా వ్యవహరిస్తున్నారు అని తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. 

Madyapradesh
Mandsaur dist's
Malhargarh
Rahul
Kanhaiya
arrested
bike riding
Tik Tok Video

మరిన్ని వార్తలు