ఇది నిజం : ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్, ఏడుగురు మృతి

Submitted on 25 May 2019
Mount Everest Traffic Jam, 7 Members Die

టైటిల్ చూసి షాక్ తిన్నారా. నమ్మబుద్ధి కావడం లేదా. కానీ ఇది నిజం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక పర్వతారోహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 12 గంటల పాటు ఒకే చోట ఇరుక్కుపోయి నరకం చూశారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన కొందరు మౌంటేనీర్లు చనిపోయారు. బుధ‌వారం (మే 22, 2019) ఉదయం ఈ ఘటన జరిగింది. శిఖరంపై ఉన్న 4వ క్యాంపు దగ్గర ఒక్క‌సారిగా ప‌ర్వ‌తారోహ‌కులు స్తంభించిపోయారు. ఏకంగా 200 మంది ఒకే చోట ఆగిపోయారు. నేపాల్ లో ఉండే.. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8వేల 848 మీట‌ర్లు. ఈ శిఖ‌రాన్ని ఎక్కేందుకు ఈసారి ప‌ర్వ‌తారోహ‌కులు ఎగ‌బ‌డ్డారు. అంతా పోటీ పడటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండు గంట‌ల పాటు ట్రెక్క‌ర్స్ అంతా ఒకే చోట వేచి ఉండాల్సి వ‌చ్చింది. ట్రెక్క‌ర్స్ ఒకేసారి రావ‌డంతో.. ఎవ‌రెస్టు శిఖ‌రంపైకి చేరుకునేందుకు చాలా మందికి ఆల‌స్యమైంది.

ట్రాఫిక్ జామ్ కావడంతో ఏడు మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మృతులను కల్పనా దాస్ (52), నిహాల్ భగ్ వాన్ (27) గా గుర్తించారు. చనిపోయిన వారిలో ఓ ఆస్ట్రేలియన్ కూడా ఉన్నాడు. నిహిల్ భగ్ వాన్ 12గంటలకు పైగా ఒకేచోట చిక్కుకుపోయాడని సహచరులు చెప్పారు. పర్వతారోహణకు ప్రయత్నించిన అంజలి కులకర్ణి (55) చనిపోయిందని ఆమె కుమారుడు శంతను కులకర్ణి మీడియాకు చెప్పారు. అస్వస్థతకు గురైన అమెరికన్ మౌంటనీర్ డొనాల్డ్ లిన్ గురువారం (మే 23, 2019) పర్వతంపైనే చనిపోయాడు.

ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడాన్ని ఓ ఘనతగా భావిస్తారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన వారిని హీరోలుగా చూస్తారు. వారికి పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. దీంతో ఈ పర్వతాన్ని ఎక్కేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఎవరెస్టు పర్వతం ఇప్పుడు మృత్యు శిఖరంగా మారుతోంది. పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు చనిపోతున్నారు. ఎవరెస్ట్ పర్వతం ఎక్కే క్రమంలో ప్రమాదాల బారిన పడి 200మంది వరకు చనిపోయారు. ఎవరెస్టు ఎక్కడమంటే ప్రమాదకరమే. ఒక రకంగా మరణాన్ని ఆహ్వానించడమే. కానీ పర్వతారోహకులు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ ఎత్తైన కొండను చేరుకుంటారు. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లీ, టెంజింగ్ నార్వే ఫస్ట్ టైమ్ ఎవరెస్ట్ ఎక్కారు.  కాగా,  కామి రీటా అనే నేపాలీ ఎవ‌రెస్ట్ ని 24వసారి అధిరోహించాడు. అలా ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు ఎక్కిన ట్రెక్కర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు.  1953 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 4వేల 400 మంది ఎవ‌రెస్టు ప‌ర్వ‌తాన్ని ఎక్కారు. 2019లో 381మందికి ప‌ర్వ‌తారోహ‌ణ‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చారు.

ప్రపంచంలో కెల్లా ఎత్తైన శిఖరం... ఎవరెస్ట్. ఈ పర్వాతాన్ని అదిరోహింది ఎంతో మంది రికార్డు సాధించారు. ఎవరెస్టుని ఎవరైనా అధిరోహించిన ప్రతిసారి వార్తల్లోకి ఎక్కేది. తొలిసారిగా... ఎవరెస్ట్ పర్వతం... చెత్త, వ్యర్థపదార్థాల కారణంగా వార్లల్లో నిలిచింది. ఎవరెస్ట్ శిఖరం మరో సమస్యను ఎదుర్కొంటోంది. అదే చెత్త సమస్య. రోజు రోజుకీ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే వారి సంఖ్య పెరుగుతుండటంతో...  పర్వతంపై చెత్త కూడా పెరిగిపోతోందని నేపాల్ సైన్యం ఆరోపిస్తోంది. దేశ, విదేశాల నుంచి పర్వతారోహకులు తరలివస్తుండటంతో ఈ మంచుకొండలపై చెత్తాచెదారం పేరుకుపోయింది. చెత్త పేరుకుపోవడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందనే భయంతో నేపాల్ సైన్యం రంగంలోకి దిగి వాలంటీర్ల సాయంతో చెత్తను తరలించే పనులు చేపట్టింది. ఏప్రిల్ 14 నుంచి మే 8వ తేదీ వరకు ఎవరెస్టు శిఖరంపై పేరుకుపోయిన 5టన్నుల చెత్త, చెదారాన్ని హెలికాప్టర్ ద్వారా తరలించామని నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ తెలిపారు. ఎవరెస్టు శిఖరంపై ఆక్సిజన్ సిలిండర్లు, టిన్ క్యాన్లు, ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలున్నాయి. ఎవరెస్టు శిఖరంపై చెత్త పేరుకోకుండా నివారించేందుకు వీలుగా ప్రతీ పర్వతారోహకుడు 8కిలోల చెత్తను కిందకు తిరిగి తీసుకురావాలని నేపాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Mount Everest
Traffic Jam
deaths
summt
mountain
Nepal
worlds tallest mountain

మరిన్ని వార్తలు