ఓటు కోసం ట్రంప్ టూర్ ? ప్రవాస భారతీయుల ఆకట్టుకోవడమే లక్ష్యం ? 

Submitted on 24 February 2020
The motive behind the America President Trump Tour

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా టూర్‌పై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల కంటే ముందుగానే..ఆయన పర్యటనపై ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. మా ఇంటికొస్తే..ఏం తెస్తావు..మీ ఇంటికొస్తే..ఏం పెడుతావు..అనే చందంగా ఉందంటున్నారు. ఆర్థిక, ఆయుధ, అంతర్జాతీయ సంబంధాలపై ఒప్పందాల మాట అటుంచితే..అంతకుమించిన ప్రయోజాలను ట్రంప్ ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే..నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయబోతున్నారు. అమెరికా దేశంలో భారతీయుల ఓట్ల సంఖ్య అధికంగా ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. వీరి మద్దతును కూడగట్టే లక్ష్యం ట్రంప్ టూర్‌లో దాగి ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ పర్యటన వల్ల ప్రవాసుల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే..భారత సంతతి అమెరికన్ల నుంచి ఆయనకు ఎన్ని ఓట్లు పడుతాయనే ప్రశ్నలు ఉత్సన్నమౌతున్నాయి. ఏషియన్ అమెరికన్ లీగల్ డిఫెన్స్, ఎడ్యుకేషన్ ఫండ్ సంస్థలు వెల్లడించిన ప్రకారం..ఎక్కువ మంది ప్రవాస భారతీయులు డెమోక్రాట్స్ ఓటర్లుగా రిజిష్టర్ అయి ఉన్నారు. కానీ..ఇక్కడ మరో పరిణామం ఉంది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, చర్యలు, అమెరికా వీసాను కష్టతరం చేసిన అంశాలు ఓటర్ మనస్సులో మెదులుతాయని అంటున్నారు. 


ప్రస్తుతం ట్రంప్ మోతార్ స్టేడియంలో చేసిన ఉపన్యాసంలో అమెరికా చేస్తున్న చర్యలను ప్రస్తావించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ - అమెరికా సంబంధాలు, మోడీ చేస్తున్న మినహా ఏ ఒక్కటి ట్రంప్ ప్రస్తావించే ప్రయత్నం చేయలేదంటున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మోడీ టీ అమ్మిపైకి తెచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. H1B వీసాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ట్రంప్..మోడీ పాలనలో భారతదేశం ముందుకు పోతోందంటూ కితాబివ్వడం గమనార్హం. 

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాక అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా వలస విధానాలను కఠిన తరం చేశారు. వీసాల జారీని తగ్గించారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలు అంతగా ఉత్సాహపరిచే విధంగా లేవు. దీంతో ప్రవాస భారతీయులు గుర్రుగా ఉన్నారు. భారత ప్రధాన మంత్రి మోడీని ప్రభావితం చేస్తే..వారి ఓట్లను ఆకట్టుకోవచ్చనే ప్లాన్ ఉండవచ్చనే అంచనా. 


* చదువు, ఉపాధి, వ్యాపారం, ఇలా..అనేక మంది భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లారు.
* 2010-2017 మధ్య భారతీయుల వలసలు 50 శాతం పెరిగాయని అంచాన. అక్కడ స్థిరపడిన వారందరిలో చాలా మందికి ఓటు హక్కు లభించింది.
* అమెరికాలో 50 రాష్ట్రాలుంటే..వాటిలో 16 రాష్ట్రాల్లో 1శాతం కంటే..ఎక్కువగా ప్రవాస భారతీయులున్నారు. 
* అమెరికా జనాభా 33 కోట్లు. ఇందులో 4.4 కోట్ల మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారు. 

* 2016 ఎన్నికల్లో ట్రంప్ ఒక్క రాష్ట్రంలో 10 నుంచి 11 వేల మధ్య ఆధిక్యం సంపాదించారు. 
* 16 రాష్ట్రాల్లో పరిశీలించగా..10 చోట్ల డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ (57.66 శాతం), ఆరు చోట్ల రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ (29.3 శాతం)కు మద్దతు ఇచ్చారని సర్వేలు వెల్లడించాయి. 
* మెజార్టీని పెంచుకొనేందుకు..ఇప్పటి నుంచే రిపబ్లికన్లు పక్కాగా వ్యూహాలు పన్నుతున్నారని అంచనా. 

* అందులో భాగంగానే ప్రవాస భారతీయులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 
* పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్ సిన్, ఫ్లోరిడా నగరాల్లో భారతీయ అమెరికన్లు 6.5 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో గుజరాతీయులు అధికం. 
* ఓటర్లను దృష్టిలో ఉంచుకొనే..భారత పర్యటనలో..అందులో..గుజరాత్‌కు వస్తున్నారనేది పరిశీలకుల అంచనా. 

Read More : వైట్ డ్రెస్‌లో మెలానియా ట్రంప్..ఆకుపచ్చ బట్ట ఏంటీ 

motive
behind
america
President
Trump Tour
Indo American
Republicans
US President
Asian American Legal Defense
Republican Hindu Coalition

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు