వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకుని చంపేసింది

Submitted on 22 February 2020
mother kills son for illegal affair

నల్లగొండ జిల్లా బుద్దారంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో... ఏకంగా తన కుమారుడినే హత్య చేసింది ఓ తల్లి. ఎనిమిదేళ్ల కుమారుడు నాగరాజును తల్లి విజయ చంపింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి కుమారుడు నాగరాజు గొంతును టవల్‌తో బిగించి చంపేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టింది. నాగరాజు మృతి అనుమాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మెడపై ఉన్న గాయాలను పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. కన్న తల్లే బిడ్డను కడతేర్చడం విషాదం నింపింది. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. పిల్లలకు ఏ కష్టం రాకుండా వారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అమ్మను దేవుడితో పోలుస్తారు. దైవ సమానంగా చూస్తారు. ఈ తల్లి మాత్రం.. ఏ తల్లి చేయని పని చేసింది. తన సుఖం కోసం కన్న బిడ్డనే చంపింది. ఏ మాత్రం కనికరం లేని ఆమెను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read More>>నిర్భయ కేసు : కుటుంబసభ్యులను కలుస్తారా..? జైలు అధికారుల లేఖ

mother
kills
Son
illegal affair
nalgonda
buddharam
lover

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు