అంతకుమించి: వరల్డ్ లోనే పెద్ద క్రికెట్ స్టేడియం ఇండియాలో

Submitted on 8 January 2019
Motera Cricket Stadium In Ahmedabad With Seating Capacity Of Over A Lakh To Be Largest In The World


ఆసిస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కంగారులను కంగారుపెట్టించి   3-1తేడాతో విజయం సాధించిన టీమిండియాకు ఇప్పుడు మరో గుడ్ న్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణ  పనులు  అహ్మదాబాద్ లోని మోతీరాలో చకచకా జరిగిపోతున్నాయి. త్వరలోనే ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానుంది. ఈ సమయంలో స్టేడియం నిర్మాణ పనుల ఫొటోలను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమళ్ నథ్ వాని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ  స్టేడియం గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కలల ప్రాజెక్టు అని పరిమళ్ నాథ్ వాని ట్వీట్ లో తెలిపారు.

 
మోతీరాలో 1లక్ష 10 వేల సీటింగ్  సామర్ధ్యంతో ఈ  స్టేడియం నిర్మించబడుతోంది. ఒకేసారి లక్ష 10వేల మంది కూర్చొని  క్రికెట్ మ్యాచ్  చూసే స్టేడియం ప్రపంచంలో ఇదే మొదటిది. ఇప్పటివరకూ... ప్రపంచంలోనే అతిపెద్ద సీటింగ్ కెపాసిటీ ఉన్న క్రికెట్ స్టేడియంగా ఆస్టేలియాలోని మెల్ బోర్న్ స్టేడియం ఉంది. మెల్ బోర్న్ సీటింగ్ సామర్ధ్యం 1లక్షా 24గా ఉంది. మెల్ బోర్న్ తర్వాత రెండవ స్థానంలో భారత్ లోని కలకత్తా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సీటింగ్ కెసాసిటీ 66వేలుగా ఉంది. అయితే వీటిన్నటిని తలదన్నేలా  ప్రపంచంలోనే  ఎక్కడా లేని విధంగా అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో భారత్ లో త్వరలో అందుబాటులోకి రానుండటంపై క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

MOTERA
WORLD BIGGEST
CRICKET STADUM
MELBOURNE

మరిన్ని వార్తలు