లక్కీ ఎస్కేప్: కారుపై ఊడిపడిన భారీ హోర్డింగ్!

Submitted on 10 January 2019
Moment when overhead road sign falls on car in Australia, driver cheats death
  • కారుపై ఊడిపడిన భారీ హోర్డింగ్.. ఆస్ట్రేలియాలో ఘటన

లేచిన వేళ బాగుంది. అందుకే తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుందో 53 ఏళ్ల మహిళ. మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆమె.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా కారులో బయల్దేరింది. మెల్ బర్న్ లోని తుల్లమెరైన్ ఫ్రీవేలోని హైవేపై కారులో దూసుకెళ్తోంది. ఇంతలో రోడ్డు పక్కనే ఉన్న భారీ హోర్డింగ్ ఒక్కసారిగా వెళ్తున్న కారుపై పడింది. కారు నుజ్జు నుజ్జుయింది. కానీ, అందులో ప్రయాణిస్తున్న మహిళ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది.

గాయాలపాలైన మహిళను రాయల్ మెల్ బోర్న్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెడకు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.  ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. హైవేపై బాధితురాలి కారు పక్కనే చాలా కార్లు ఉన్నప్పటికీ మహిళ కారుపైనే భారీ హోర్డింగ్ పడిందని హైవే పెట్రోలింగ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటన అక్కడి హైవే సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 

road sign
Car
Australia
car driver
Royal Melborne hospital
Car driver

మరిన్ని వార్తలు