మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రపంచ నేతలు!

Submitted on 25 May 2019
modi's swearing-inn ceremony likely on may 30,world leaders may be invited

సార్వత్రిక ఎన్నికల్లో  అఖండ విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. మే-30,2019న నరేంద్రమోడీ మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు మోడీ వారణాశి వెళ్లనున్నారు.వరుసగా రెండోసారి తనను భారీ మెజార్టీతో లోక్ సభకు పంపించిన వారణాశి ప్రజలకు కృతజ్ణతలు తెలిపేందుకు మోడీ వారణాశి వెళ్లనున్నారు.అంతేకాకుండా ప్రమాణస్వీకారోత్సవానికి ముందే తల్లి ఆశిస్సులు తీసుకునేందుకు మోడీ గాంధీనగర్ వెళ్లనున్నారు.

మోడీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి దేశీయ నాయకులతో పాటుగా విదేశీ నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విదేశీ నేతలను ఆహ్వానించే విషయమై పార్టీలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.భారత్‌ పొరుగున్న ఉన్న దేశాల అధినేతలతో పాటు, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల అధ్యక్షులను ఆహ్వానించే అవకాశాలున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, అబుదాబీ యువరాజు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూలను మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఐక్యరాజ్యసమితి పీ-5 దేశాల అధినేతలను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. పీ-5 అంటే ఐరాసలో శాశ్వత సభ్య దేశాలైన యూఎస్‌, చైనా, రష్యా, ఫ్రాన్స్‌, యూకే దేశాలు. 2014లో మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలు హాజరైన విషయం తెలిసిందే.

Modi
World Leaders
swearing in ceremony
Invite
NDA
BJP
GANDHINAGAR
mother
BLESSINGS
varanasi
Visit

మరిన్ని వార్తలు