మోడీ ఫారిన్ టూర్ కన్ఫాం

Submitted on 24 May 2019
Modi Foreign Tour Conform

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ రెండోసారి బాధ్యతలు స్వీకరించకముందే ఆయన తొలి విదేశీ పర్యటన ఖరారు అయింది. జూన్ 13న కజకిస్తాన్‌లో జరిగే షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ సమావేశానికి మోడీ వెళ్లనున్నారు. అంటే బాధ్యతలు స్వీకరించిన ఇరవైరోజుల లోపే మోడీ విదేశీ పర్యటనలు ప్రారంభం అవుతున్నట్లు అనుకోవచ్చు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ తొలి విదేశీ పర్యటన పొరుగు దేశమైన భూటాన్‌లో చేశారు.

ఇప్పుడు మాత్రం రష్యా దేశంలో కావడం విశేషం. ప్రధానిగా రెండోసారి అయిన అనంతరం దేశంలో ఏ ప్రాంతానికి వెళ్తారో ఖరారు కాకపోయినా..అప్పుడే ఫారిన్ టూర్ కన్ఫామ్ అవడం గమనించవచ్చు. ఈ షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి పాకిస్తాన్ కూడా హాజరు అయ్యే అవకాశం కన్పిస్తోంది. దీంతో ప్రధాని ఇమ్రాన్‌ని తొలిసారిగా ముఖామఖీ కలవడం కూడా జరగవచ్చు.

Modi Foreign Tour
Conform
india prime minister
Election 2019
loksabha News

మరిన్ని వార్తలు