మే 12న MMTS రైళ్లు రద్దు

Submitted on 9 May 2019
MMTS trains canceled on May 12

హైదరాబాద్ : హైదరాబాద్ లోని MMTS రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. బేగంపేట-సనత్‌నగర్ మధ్య రైల్వే ట్రాక్‌కు సంబంధించిన మరమ్మతుల కారణంగా ఈనెల 12న 14 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు.

రద్దు కానున్న రైలు సర్వీసులు-రైలు నంబర్లు 

  1. ఫలక్‌నుమా-లింగంపల్లి (47149)
  2. లింగంపల్లి-ఫలక్‌నుమా (47173)
  3. లింగంపల్లి-ఫలక్‌నుమా (47171)
  4. ఫలక్‌నుమా-లింగంపల్లి (47151)
  5. ఫలక్‌నుమా-లింగంపల్లి (47150)
  6. లింగంపల్లి-ఫలక్‌నుమా (47174)
  7.  హైదరాబాద్‌-లింగంపల్లి (47100)
  8. లింగంపల్లి-హైదరాబాద్‌ (47127)
  9. హైదరాబాద్‌-లింగంపల్లి (47101)
  10. లింగంపల్లి-హైదరాబాద్‌ (47128)
  11. లింగంపల్లి-హైదరాబాద్‌ (47129)
  12. హైదరాబాద్‌-లింగంపల్లి (47105)
  13.  ఫలక్‌నుమా-లింగంపల్లి (47153)
  14. లింగంపల్లి-ఫలక్‌నుమా (47176)

ఈ  మార్గంలో నడిచే రైళ్లను తాత్కాలికంగా ఒక్క రోజు రద్దు చేసినట్లు తెలిపారు. పనులు ముగిసిన వెంటనే పునరుద్ధరిస్తామని  సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. 

Hyedrabad
MMTS
Trains
Canceled
May 12

మరిన్ని వార్తలు