‘థియేటర్లో మర్డర్లు ఎవరు చేస్తున్నారు’? ఎంఎంఓఫ్ - టీజర్

Submitted on 9 October 2019
MMOF - Official Teaser

కొంత గ్యాప్ తర్వాత యాక్టర్ కమ్ డైరెక్టర్ జేడీ చక్రవర్తి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్న సినిమా ‘ఎంఎంఓఫ్’.. యన్.ఎస్.సీ దర్శకత్వంలో.. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, జేకే క్రియేషన్స్ బ్యానర్‌పై.. రాజా, రాజశేఖర్, జేడీ ఖాసీం నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ‘ఎంఎంఓఫ్’ టీజర్ రిలీజ్ చేశారు.

‘నా పేరు దీపక్.. ఒకప్పుడు మా థియేటర్ కూడా కళకళలాడుతూ ఉండేది.. మా థియేటర్‌లో ఏవో ఒకటి అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి.. సినిమా చూడ్డానికొచ్చిన జనాలు, తెలియకుండా ఏదో ప్రమాదానికి గురవుతున్నారు. ఎవరీ థియేటర్లో మర్డర్లన్నీ చేస్తున్నారు’.. అంటూ సాగే టీజర్ ఉత్కంఠంగా అనిపిస్తుంది.

Read Also : ఐ యామ్ ది రూలర్ - ‘యువరత్న’ టీజర్

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఎంఎంఓఫ్’ త్వరలో విడుదల కానుంది. బెనర్జీ, సంపూర్ణేష్ బాబు, అక్షత, మనోజ్ నందం, టార్జాన్ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. మ్యూజిక్ : సాయి కార్తీక్, డీఓపీ : అంజి, ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్.  

JD Chakravarthy
Akshatha
Sai Kartheek
Yen S See

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు