ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కంటతడి

Submitted on 16 April 2019
mla pushpa Pamula Pushpa Sreevani cries front of media

విజయనగరం కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మీడియా ఎదుట కంటతడిపెట్టారు. మహిళా ఎమ్మెల్యే అయిన తనపై దాడి జరిగినా.. పోలీసులు ఇంత వరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం జిల్లా ఎస్పీని ఆమె కలిశారు.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

పోలింగ్ రోజున జరిగిన దాడి ఘటనను వివరించారు. ఈ సందర్భంగా ఘటనపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. తన భర్తను కూడా చంపాలని శత్రుచర్ల విజయయరామరాజు కుట్ర చేశారని ఆరోపించారామె. ఎమ్యెల్యే అయిన తనపైన దాడి జరిగినా స్పందించని పోలీసులు సామాన్యుడి విషయంలో ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చన్నారు. 

ఏప్రిల్ 11వ తేదీ APలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చిన్నకుదుమా బూత్ నెంబర్ 152లో రిగ్గింగ్ జరుగుతున్న సమాచారంతో ఎన్నికల అధికారులకు తాను కంప్లయింట్ చేయడానికి వెళ్లడం జరిగిందని పుష్ప శ్రీవాణి గుర్తు చేశారు. ఆ సమయంలో ZPTC భర్త అయిన డొంకాడ రామకృష్ణ..ఆయన అనుచరులు, శత్రుచర్ల విజయరామరాజు ఆధ్వర్యంలో తనపై దాడి చేశారన్నారు. తీవ్రంగా గాయపరిచి..తనను చంపడానికి ప్రయత్నించారని పుష్ప శ్రీవాణి తెలిపారు. 
Read Also : కర్నాటకలో EC దూకుడు : యడ్యూరప్ప లగేజ్ తనిఖీ

Kurupam mla
Pamula Pushpa Sreevani
cries
front of media
vizayanagaram
Satrucharla


మరిన్ని వార్తలు