మెట్రోరైల్ రికార్డు: 2లక్షల26వేల మంది ప్రయాణం

Submitted on 12 January 2019
Metrorail record: 2 lakhs 26 thousand travel

హైదరాబాద్:  హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. సంక్రాంతి పండుగసందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నగర వాసులు రైల్వే స్టేషన్, బస్టాండ్లకు చేరుకోటానికి మెట్రో రైలును ఆశ్రయించారు. శుక్రవారం అత్యధికంగా రెండు లక్షల ఇరవై ఆరు వేల మందిని గమ్యస్థానాలకు చేర్చింది మెట్రో రైల్. సిటీలోని వివిధ ప్రాంతాల నుండి ప్రధానమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, నాంపల్లి రైల్వేస్టేషన్, సిటీబస్టాండ్ తో పాటు, జూబ్లీ బస్స్టాండ్ ల నుంచి తమ తమ ఊళ్లకు వెళ్లేందుకు నగర ప్రజలు పయనమయ్యారు. సరైన సమయంలో రైల్వేస్టేషన్లకు, బస్స్టేషన్లకు చేరుకునేందుకు ట్రాఫిక్ రద్దీ తప్పించుకునేందుకు శుక్రవారం ప్రజలు మెట్రో రైల్ ను  ద్వారా ప్రయాణించారు. దాంతో మెట్రో రైలుకు భారీగా రద్దీ పెరిగింది.
ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్ వంటి ప్రాంతాల నుంచి మెట్రో స్టేషన్లకు ఇంటర్ సిటీ బస్సులు సౌకర్యం పెరగడంతో మెట్రో రద్దీ పెరిగిందని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. మియాపూర్ స్టేషన్ నుంచి 16 వేల మంది, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుండి 16 వేల మంది, అమీర్పేట స్టేషన్ నుండి ఇరవై ఒక్క వేల మంది, ఎల్బీ నగర్ నుండి 16 వేల మంది, ఎల్బీనగర్ స్టేషన్ నుండి 11 వేల మంది మెట్రో లోశుక్రవారం ప్రయాణం చేశారు.

Hyderabad Metro
pongal
Festival
Sankranti
Metro rail

మరిన్ని వార్తలు