కౌంటింగ్ పిచ్చి.. చివరికి టీవీతోనే మెట్రో ప్రయాణం

Submitted on 23 May 2019
 Metro station in Mumbai carrying tv

దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్ కనపిస్తోంది. భారీ అంచనాలకు తెరదించుతూ.. మరో ఐదేళ్లు నాయకుడిగా ఎవరొస్తారనేది మే 23సాయంత్రానికి తేలిపోనుంది. ఈ క్రమంలో కౌంటింగ్‌పై అమితాసక్తి చూపిస్తున్నారు దేశ ప్రజలంతా..  రాజకీయ నాయకులతో పాటు కార్యకర్తల్లోనూ భారీ ఉత్కంఠ నెలకొంది. 

కొందరు టీవీల్లో మరి కొందరు స్మార్ట్‌ఫోన్లలో ఓట్ల లెక్కింపును గమనిస్తుంటే.. ముంబై మెట్రో స్టేషన్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఇంగ్లీష్ మీడియా సంస్థకు చెందిన ఉద్యోగి వీపుకు టీవీని కట్టుకొని ఓట్ల లెక్కింపు లైవ్ అందిస్తున్నాడు. 

ఈ టీవీలో మెట్రో రైలు కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు ఓట్ల లెక్కింపును వీక్షిస్తున్నారు. దీనికి సంబందించిన ఫోటోను మరో వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 

Metro Station
TV

మరిన్ని వార్తలు