పండగ చేస్కోండి : మెట్రో రైల్లో టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ 

Submitted on 30 September 2019
Metro rail considering 50 discount holidays boost ridership

మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మెట్రో రైలు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి వీకెండ్ సమయంలో రైల్లో ప్రయాణించే వారికి డిస్కౌంట్ ఎంజాయ్ చేయొచ్చు. పండుగ సీజన్‌లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైలు సర్వీసులను వినియోగించుకునేలా చెన్నై మెట్రో రైలు స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో మెట్రో సర్వీసులను కూడా పెంచినట్టు నివేదికలు తెలిపాయి. సాధారణంగా చెన్నై మెట్రో రైల్లో వారాంతాల్లో 1.2 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. 

ఇటీవల ఆదివారాల్లో ప్రయాణించే వారి సంఖ్య 70వేలకు పడిపోయింది. మెట్రో సర్వీసును ఎక్కువ మంది వినియోగించుకునేలా.. ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచే దిశగా మెట్రో రైలు అధికారిక విభాగం స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అందిన రిపోర్టు ప్రకారం.. ఆదివారాల్లో మెట్రో రైలు ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఆదివారాలతో పాటు హాలీడే సమయాలు, ఏడాది పాటు స్పెషల్ డిస్కౌంట్లు ఆఫర్ చేయాలనే ప్రతిపాదన మేరకు చెన్నై మెట్రో రైలు యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను చెన్నై మెట్రో రైలు బోర్డుకు పంపగా.. ప్రతిపాదనపై తుది నిర్ణయం వెల్లడి కాలేదు. 

2017లో చెన్నై మెట్రో రైలు అన్ని టికెట్లపై 40శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసింది. వారం పాటు డిస్కౌంట్ మేళా కొనసాగగా 67శాతానికి పెరిగింది. 2017 దీపావళి సమయంలో నెలకు పైగా ఇదే డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఆ సమయంలో చెన్నై మెట్రో రైలు అన్ని టికెట్లపై 20శాతం డిస్కౌంట్ ఆఫర్ చేయడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అంతేకాదు.. ఫీడర్ క్యాబ్ సర్వీసులను చెన్నై మెట్రో రైలు ప్రకటించింది.

మెట్రో స్టేషన్ల మధ్య ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ సర్వీసులను నడపనుంది. స్పెషల్ మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు ముందుగానే క్యాబుల్లో ప్రీ బుకింగ్ సీటు రిజర్వ్ చేసుకోవచ్చు. రూ.10 నుంచి ఫీడర్ సర్వీసును పొందవచ్చు. స్టేషన్ల మధ్య 6 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ ఫీడర్ క్యాబ్ సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. 

Metro rail
Chennai Metro rail board
discount
Holidays
ridership
feeder cabs
Train Passengers
Metro Tickets

మరిన్ని వార్తలు