ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి

Submitted on 16 April 2019
​​​​​​​Meteoroid Strikes Eject Precious Water From Moon

చంద్రుడిపై నీరు ఉందా? భూమిపై నీరు ఉన్నట్టుగానే చంద్రుడిపై కూడా నీరు ఉద్భవిస్తుందా? ఎప్పుడు పొడిగా కనిపించే చంద్రగ్రహం ఉపరితలంపై అసలు నీరు ఉండటం సాధ్యమేనా? చంద్రుడిపై కూడా మానవ నివాసాలను ఏర్పాటు చేసుకోవచ్చా? ఉల్కపాతం ఏర్పడిన సమయంలో చంద్రగ్రహంపై ఎలాంటి పరిణామాలు జరుగుతాయి.. ఉల్కపాతాలపై శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు. ఉల్కపాతాలతో చంద్రుడిపై నీరు ఉద్భవిస్తుందా? ఇలాంటి సమాధానం దొరకని ప్రశ్నలెన్నో. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా అంతరిక్ష కేంద్రం ఇటీవల ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

చంద్రుడి ఉపరితలంపై నీరు ఉందనడానికి ఆనవాళ్లను నాసా గుర్తించింది. ఉల్కపాతాల సమయంలో చంద్రుడి ఉపరితలంపై నీళ్లు చిమ్మినట్టు నాసా పరిశోధనల్లో తేలింది. స్పేస్ ఏజెన్సీ ల్యూనర్ అట్మోస్పియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్ మెంట్ ఎక్స్ ప్లోరర్ (LADEE) రోబెటిక్ మిషన్ ఆధారంగా నీళ్లు ఉన్నట్టు గుర్తించింది. అక్టోబర్ 2013 నుంచి ఏప్రిల్ 2014 నుంచి చంద్రుడి ఉపరితలంలోకి పంపిన రోబొటిక్ మిషన్ అక్కడి వాతావరణ పరిస్థితులకు సంబంధించి సమాచారాన్ని సేకరించి నాసాకు చేరవేసింది.

H2O.. OH ఆనవాళ్లు : 
ఇప్పటివరకూ చంద్రుడిపై (నీరు) H2O, OH (హైడ్రాక్సిల్) నీటి ఆనవాళ్లు కనిపించాయి. చంద్రుడిపై ఉన్న నీరు క్రమంగా బయటకు ఊరుతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా, జాన్‌హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు సంయుక్త పరిశోధనలో చంద్రుడిపై నీళ్లు ఉద్భవించడం నిజమేనని గుర్తించారు. ఉల్కపాతం సమయంలో ఉల్కలు చంద్రుడి ఉపరితలంపై పొరను బలంగా ఢీకొట్టినప్పుడు సన్నని పొర చీలిపోయి ఆ పొర లోపలి నుంచి నీరు చిమ్మినట్టు పరిశోధనలో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కొత్త పరిశోధనకు సంబంధించి విషయాలను నేచురల్ జియో సైన్సెస్ లో మెహదీ బెన్న ఆఫ్ నాసా ఫ్లయిట్ సెంటర్ ప్రచురించింది.

చంద్రుడిపై నీళ్లు ఉంటే.. భవిష్యత్తులో మరిన్ని విషయాలను శోధించేందుకు వీలు అవుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉల్కలు చంద్రుని ఉపరితలంపై పడినప్పుడు అక్కడి మంచురూపంలో ఉన్న నీరు ఒక్కసారిగా ఆవిరి రూపంలో బయటకు చిమ్మినట్టు పరిశోధనలో నాసా గుర్తించింది. ఉల్కలకు, నీటికి సంబంధం ఏంటి? ఉల్కలు పడిన సమయాల్లో నీరు ఎలా బయటకు వస్తుంది అనేదానిపై నాసా విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. 
Read Also : మహిళను ఈడ్చుకెళ్లిన మెట్రో రైలు : తలకు తీవ్రగాయాలు

Meteoroid
Precious Water
Moon
LADEE  

మరిన్ని వార్తలు