సైరా - సెన్సార్ పూర్తి

Submitted on 23 September 2019
Megastar Chiranjeevi's  Sye Raa NarsimhaReddy Certified with 'U/A'

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన ధీరుడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం.. 'సైరా నరసింహారెడ్డి'.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైరా రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సినిమా చూసిన సెన్సార్ టీమ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అమితాబ్ బచ్చన్, నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనుండగా, నయనతార, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా.. తమన్నా, లక్ష్మీగా నటించారు. వీరా రెడ్డిగా జగపతిబాబు, అవుకు రాజుగా 'కిచ్చా' సుదీప్, రాజా పాండిగా 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, బసి రెడ్డిగా రవి కిషన్ కనిపించనున్నారు.

Read Also : సైరా విడుదల ఆపండి : హైకోర్టులో ఉయ్యాలవాడ వారసుల పిటిషన్..

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో 'సైరా'  భారీగా విడుదల కానుంది. సంగీతం : అమిత్ త్రివేది, కెమెరా : రత్నవేలు, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ నంబియార్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కణ్ణన్.

 

Megastar Chiranjeevi
Amit Trivedi
Ram Charan
Surender Reddy

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు