చిరంజీవి 'పవన్ శంకర్' : అభిమాని కొడుకుకి పేరు పెట్టిన చిరు

Submitted on 22 April 2019
Megastar Chiranjeevi Named 'Pavan Shankar'  for His Hardcore Fan Son-10TV

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. రాజకీయాల్లోకి వెళ్ళి, తొమ్మిదేళ్ళు గ్యాప్ తీసుకున్న చిరు.. 150 వ సినిమా ఖైదీ నెం: 150 తో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసాడో తెలిసిందే. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి షూటింగ్‌లో పాల్గొంటున్న చిరు, ఈ మధ్య తన అభిమాని కొడుక్కి పేరు పెట్టాడు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈస్ట్ గోదావరికి చెందిన నక్కా వెంకటేశ్వర రావు.. చిరు వీరాభిమాని.. తన కొడుకుకి చిరు చేత పేరు పెట్టించాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నాడు..
Also Read : కోట్ల మందికి ఇదే దిక్కు : 123456.. మీ పాస్‌వ‌ర్డ్‌ మాకు తెలుసు

ఈ విషయం చిరుకి తెలియడంతో, అతణ్ణి పిలిచి, మాట్లాడి.. ఆ పిల్లాడికి, తన తమ్మడు పవన్ కళ్యాణ్ పేరులోని పవన్, తన అసలు పేరైన శివ శంకర వర ప్రసాద్‌లోని శంకర వచ్చేలా 'పవన్ శంకర్' అని పేరు పెట్టాడు. తర్వాత అభిమాని, అతని కుటుంబ సభ్యులందరితోనూ చిరు ఫోటోలు దిగాడు. దీంతో, ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవు.. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో జోరుగా వైరల్ అవుతుంది.
Also Read : ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్‌లో.. మే12న

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi Named 'Pavan Shankar' for His Hardcore Fan Son

మరిన్ని వార్తలు