నాగబాబు న్యూ పిక్-బాలయ్య ఫ్యాన్స్‌కి కిక్

Submitted on 11 January 2019
Mega Brother Nagababu Pic Goes Viral-10TV

మెగా బ్రదర్ నాగబాబు గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఏ రేంజ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. బాలకృష్ణ, తన అన్నయ్య చిరంజీవి గురించీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురిచీ అసభ్యంగా మాట్లాడాడనీ నాగబాబు, పార్ట్స్ పార్ట్స్‌గా వీడియోలు తీసి, ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేస్తున్నాడు. ఆరవ వీడియోతో ఆపేస్తానని చెప్పాడు. బాలయ్య అప్పుడెప్పుడో అన్నదానికి ఇప్పుడు రియాక్ట్ అవడం ఏంటని అడిగితే, మా అన్నయ్య చిరంజీవి చెప్తే ఆగిపోయాను అని చెప్పాడు నాగబాబు. మరోవైపు సోషల్ మీడియా సెన్సేషన్ శ్రీరెడ్డి కూడా నాగబాబుపై, మెగా ఫ్యామిలీపై విరుచుకు పడుతుంది.

రీసెంట్‌గా నాగబాబు లేటెస్ట్ ఫోటో ఒకటి నెటిజన్స్‌కి దొరికింది. దాన్నడ్డం పెట్టుకుని బాలయ్య ఫ్యాన్స్ నాగబాబుపై విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ ఫోటో ఎక్కడిది, ఏంటి అంటే, నాగబాబు ప్రస్తుతం అక్కినేని అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తున్నాడు. షాట్ గ్యాప్‌లో, అఖిల్ పెట్‌తో పిక్ తీసుకుని, ఇది ఫ్రెంచ్ బుల్ డాగ్, అఖిల్ పెట్, నాకు బాగా నచ్చింది. క్యూట్‌గా ఉంది కదా అని పోస్ట్ చేసాడు నాగబాబు. ఇక, ఈ ఫోటోని విపరీతంగా షేర్ చేస్తూ, తమ క్రియేటివిటీతో రకరకాలుగా పోస్ట్‌లు చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

Mega Brother Nagababu
Mega Brother Nagababu vs Balakrishna Fans

మరిన్ని వార్తలు