ఠాగూర్ వైద్యం : ఎడమకాలికి గాయం.. కుడికాలికి ఆపరేషన్

Submitted on 11 February 2019
Medical negligence Duty: Doctors Operate Wrong Leg Of An Odisha Patient Who Went For Wound Treatment

వైద్యో నారాయణో హరి.. అంటారు. చికిత్స చేసి ప్రాణాలు కాపాడుతాడు కదా. పవిత్రమైన వృత్తిలో ఉండి.. ఇటీవల కొంతమంది వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పేషెంట్ల ప్రాణాలు రక్షించాల్సింది పోయి నిర్లక్ష్యంతో వారి ప్రాణాల మీదకు తెస్తున్నారు. కొండ నాలుకకు మందు వేయండయ్యా అంటే.. ఉన్న నాలుక ఊడదీసినట్టు ఉంది వీరి వ్యవహారం..  ఒడిషాలోని ఆనంద్ పూర్ సబ్ డివిజన్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో ఓ మహిళ కు చేసే ట్రిట్ మెంట్ విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.


ఒక కాలికి గాయమైతే మరో కాలికి ట్రీట్ మెంట్ చేశారు. ఒడిషా రాష్ట్రం కబాలీ గ్రామానికి చెందిన మిటారాణి జీనా అనే (40) మహిళ ఎడమ కాలికి గాయమైంది. తీవ్రమైన బాధతో ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన ఆస్పత్రి వైద్యుడు నర్సులకు డ్రెస్సింగ్ చేయమని సూచించారు. కానీ, అక్కడి నర్సులు ఎడమ కాలికి ట్రీట్ మెంట్ అయితే.. మహిళ కుడికాలికి ట్రీట్ మెంట్ చేశారు. కాలికి ట్రీట్ మెంట్ చేసే సమయంలో మహిళ మత్తులో ఉంది.


ఆమె లేచి చూసేసరికి తన కుడి కాలికి ట్రీట్ మెంట్ చేసి ఉంది. దీంతో జీనా షాక్ కు గురైంది. అదేంటీ.. ఎడమ కాలికి కదా? గాయమైంది.. కుడి కాలికి చేసేరెంటీ అని ఆమె నర్సులను ప్రశ్నించింది. కంగుతిన్న నర్సుల నోటి వెంట మాటరాలేదు. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. పైగా... కొన్ని రోజుల సమయం పడుతుందని, అప్పటి నుంచి నెమ్మదిగా ఆమె నడవగలదని చెప్పి చేతులు దులుపుకున్నారు.


వైద్యుల నిర్లక్ష్యపు సమాధానంపై ఆగ్రహించిన మహిళ భర్త త్రిలోచన్ జీనా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశాడు. జిల్లా కలెక్టర్ కీయెంజర్ అశిష్ థాక్రే కు బాధిత మహిళ ఫిర్యాదు చేయగా.. వెంటనే విచారణ జరపాల్పిందిగా ఆదేశించారు.  
 

గత ఏడాదిలో ప్లోరిడాలో యూఎస్ సర్జన్ నిర్లక్ష్యంగా వ్యహరించి పేషెంట్ కిడ్నీని తొలగించారు. కణితి ఉందనే అనుమానంతో అనవసరంగా పేషెంట్ కిడ్నీని తొలగించారు. ఇటీవల హైదరాబాద్ లో కూడా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళకు ఆపరేషన్ చేసి ఆమె కడుపులో కత్తెరను వదిలేసిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. 

Doctors
Wrong Leg
Odisha Patient
Wound
Treatment
Mitarani Jena   

మరిన్ని వార్తలు