రోగులతో డాక్టర్లు లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు

Submitted on 19 April 2019
MCI Guidelines to Doctors in India

 

రోగులతో డాక్టర్లు లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదంటూ భారత వైద్య మండలి(ఎంసీఐ) కొత్తగా నిబంధనలు విధించింది. ఈ మేరకు ఎంసీఐ వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలను విడుదల చేసిన ఎంసీఐ డాక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ (ఐపీఎస్‌) మార్గదర్శకాలను పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంసీఐ వెల్లడించింది.

"డాక్టర్లు రోగులతో పరస్పర అంగీకారం ఉన్నా కూడా లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదని, అలాంటి చర్యలు వైద్య నియమావళికే విరుద్ధం’’ అని ఎంసీఐ విడుదల చేసిన మార్గదర్శకాల్లో చెప్పింది. ఒకవేళ డాక్టర్లు చికిత్స చేసేప్పుడు చేయవలసిన విధానంకు విరుద్ధంగా చికిత్స చేస్తున్నట్లు అనిపించినా కూడా తోటి డాక్టర్లను చికిత్సపై రోగులు ఆరా తీసి కంప్లైంట్ చేయవచ్చు.
Also Read : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?

గైడ్ లైన్స్:

-డాక్టర్లు చికిత్స చేసే సమయంలో లైంగికం రోగులతో సంబంధాలు పెట్టుకోకూడదు. రోమాన్స్ చేయరాదు.

-రోగి తనంతట తానే లైంగిక సంబంధం కోరుకున్నా కూడా డాక్టర్లు ఒప్పుకోకూడదు.

-డాక్టర్లు, రోగికి మధ్య లైంగిక సంబంధం చికిత్స అందించే విధానంలో విపరీత మార్పులు తెస్తుందని, అటువంటి సంబంధం రోగికి నష్టం కలిగేలా చేస్తుంది.

-డాక్టర్లు రోగికి సంబంధించి జననేంద్రియాలను పరీక్షించవలసి వచ్చిపుడు కూడా రోగితోపాటు సహాయకులు ఉండాలి.

-వైద్యులు తమ మాజీ రోగులతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు.

ఇటీవల కాలంలో డాక్టర్లు రోగులపై లైంగిక దాడులు చేస్తున్న ఘటనలు ఎక్కువ కావడంతో ఎంసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతుంది. ఎంసీఐ గైడ్ లైన్స్ తప్పితే వారి లైసెన్స్ లు రద్దు చేయడమే కాక చట్టప్రకారం చర్యలు ఉంటాయని చెబుతున్నారు. 
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

Patients
Doctors
MCI

మరిన్ని వార్తలు