కాలిఫోర్నియా ప్రార్థనా మందిరంలో కాల్పులు..ఒకరు మృతి

Submitted on 28 April 2019
Mayor says synagogue shooting in California that left 1 dead and 3 wounded was a 'hate crime'

అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నార్త్  శాన్ డియోగోకి 22 మైళ్ల దూరంలోని పోవే సిటీలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పొవే మేయర్ స్టీవ్ వాస్ తెలిపారు.కాల్పుల ఘటనకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తున్న 19 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.కాగా జాతి విద్వేషం కారణంగానే దుండుగుడు కాల్పులు జరిపినట్టు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ప్రస్తుతానికి దీనిని జాతి విద్వేష చర్యగానే భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

usa
poway
california
shooting
fire
hate
crime
Mayor
steven vaus
Dead
WOUNDED
trump

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు