భారత్-పాక్ మ్యాచ్ పై ముఫ్తీ ఏమన్నారో తెలుసా!

Submitted on 16 June 2019
May the best team win in today’s 🇮🇳 vs 🇵🇰 cricket match:Mehbooba mufti

వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇవాళ జరుగుతున్న భారత్‌-పాక్‌  మ్యాచ్‌పై జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌ ప్రేమికులకు తాము అభిమానించే జట్టును ఉత్సాహపరిచే హక్కు ఉందని ముఫ్తీ అన్నారు.ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. ఇవాళ జరుగుతున్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ లో అత్యుత్తమ జట్టు విజయం సాధించొచ్చు. తాను అభిమానించే జట్టును ఉత్సాహపరిచే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనిపై మనమంతా సదాభిప్రాయంతో ఉండాలని ఆ ట్వీట్ లో తెలిపారు.’

వరల్డ్ కప్ టోర్నమెంట్స్‌ లో ఇప్పటివరకు పాకిస్థాన్‌ తో జరిగిన అన్ని మ్యాచ్‌ లలోనూ భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇవాళ జరగుతున్న మ్యాచ్‌ లోనూ భారత్ దూకుడుగా ఆడింది.టాస్‌ గెలిచిన పాక్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 336 పరుగులు చేశారు.ఓపెనర్ రోహిత్ శర్మ 140 పరుగులు కొట్టి పాక్ బౌలర్లకు చెమటలు పట్టించాడు.కేఎల్ రాహుల్,కెప్టెన్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడారు.

Mehbooba Mufti
Kashmir
india
Pak
Match
right
civil
win
select
individual


మరిన్ని వార్తలు