సిడ్నీ టెస్టు : వర్షం అడ్డంకి

Submitted on 7 January 2019
Match delayed by rain 4th Test, India tour of Australia at Sydney  | 10TV

ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్‌ యాదవ్‌
ఆస్ట్రేలియా 300 ఆలౌట్‌

సిడ్నీ విజయంపై కోహ్లిసేన కన్ను
322 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం
ఫాలోఆన్‌లో 6/0

సిడ్నీ : ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయాన్ని నమోదు చేయాలన్న భారత్ ఆశలపై వాన జల్లులు చల్లాడు. ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. ఇప్పటికే టీమిండియా సిరీస్ విజయాన్ని ఖాయం చేసుకుంది. వర్షం ఆగిపోతే..3-1 సిరీస్‌ను సాధించాలని ఇండియా చూస్తోంది. వర్షం కురుస్తుండడంతో సిడ్నీ టెస్టు డ్రా దిశగా సాగుతోంది. 
భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/99) విజృంభణతో ఆసీస్ కుప్పకూలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే కుప్పకూలిపోయింది. 322 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్...ఆస్ట్రేలియా ఫాలోఆన్ విధించింది. 4 ఓవర్లు ఆడిన ఆసీస్ 6/0తో కొనసాగుతోంది. వెలుతరు సమస్యతో నాలుగో రోజు ఆట నిలిపివేసే సమయానికి ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజ (4), మార్కస్ హరీస్ (2) క్రీజులో ఉన్నారు. వర్షం పడుతుండడంతో మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 622/7 డిక్లేర్డ్‌.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 300 ఆలౌట్.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్) 6/0.

Also Read : 71 ఏళ్ల కల సాకారం : సిరీస్ భారత్ వశం...

Match delayed
rain
4th Test
india
Tour
Australia
Sydney
Kuldeep Yadav
Sydney Test
Rain Delay

మరిన్ని వార్తలు