అడ్డంగా బుక్ అయ్యారు : పీజీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్

Submitted on 24 April 2019
Mass copying in the PG exams

విజయనగరం జిల్లా ఎస్ కోట చైతన్య డిగ్రీ కాలేజ్ లో పీజీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగింది. ఎంఏ సోషల్ వర్క్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కు కాపీయింగ్ కు పాల్పడ్డారు. మాస్ కాపీయింగ్ కు కాలేజ్ యాజమాన్యం భారీగా డబ్బు వసూలు చేసింది. 
Also Read : భారత హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు

ఎస్ కోట చైతన్య డిగ్రీ కాలేజ్ లో జరుగుతున్న పీజీ పరీక్షల్లో విద్యార్థులు జోరుగా మాస్ కాపీయింగ్ పాల్పడ్డారు. గైడ్స్ పెట్టుకుని యథేచ్ఛంగా పరీక్షలు రాశారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా విద్యార్థులు మెటీరియల్ తీసుకుని మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న దృశ్యాలు కనపడ్డాయి. మీడియాను చూసి కొంత మంది విద్యార్థులు వారు తెచ్చుకున్న బుక్స్ ను కిటికిలో నుంచి బయటకు విసిరివేశారు. యాజమాన్యం అభ్యర్థుల నుంచి డబ్బులు గుంజి మాస్ కాపీయింగ్ కు సహకరించినట్లు తెలుస్తోంది.

ఇక్కడ జరిగిన మాస్ కాపీయింగ్ కు పాల్పడిన విషయం ఆంధ్రా యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్లింది. మాస్ కాపీయింగ్ కు పాల్పడినవారిపై, అందుకు సహకరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : ఇంట‌ర్ అల‌ర్ట్ : రీ-వాల్యూయేషన్, కౌంటింగ్ కు ఇలా అప్లయ్ చేసుకోండి

Mass copying
PG exams
vijayanagaram
S. Kota
Chaitanya Degree College

మరిన్ని వార్తలు