దేశ చరిత్రలో చీకటి రోజు : ప్రధాని జసిండా ఆర్డెర్న్

Submitted on 15 March 2019
Masjid firing incident Responding to PM Jacinda Arned New Zealand

న్యూజిలాండ్ : న్యూజిలాండ్ దేశంలోని  ప్రముఖ నగరాల్లోని రెండు మసీదుల్లో దుండగుల కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనపై  ప్రధాని జసిండా ఆర్డెర్న్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజు అని అన్నారు.  కాల్పులతో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. దీంతో న్యూజిలాండ్ పోలీసులు శాంతి భద్రతలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తం అయ్యారు. కాల్పుల నేపథ్యంలో సెంట్రల్ సిటీ భవనాలు, సెంట్రల్ లైబ్రరీ, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. 
Read Also: క్రికెటర్ షమీకి షాక్ : గృహహింస కింద చార్జిషీట్

క్రైస్ట్ చర్చి ప్రాంతంలోని అల్‌ నూర్‌ మసీదులో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 12మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం (మార్చి 15) కావడంతో...ముస్లింలు ప్రార్థనల కోసం మసీదుల వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో  మధ్యాహ్న ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ మసీదు వద్దకు బంగ్లాదేశ్ క్రికెటర్లు వచ్చారు. ఈ సమయంలో ఓ వ్యక్తి షూటర్ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారంతా పరుగెత్తుకుంటు వెళ్లి ప్రాణాలు  కాపాడుకున్నారు. ఈ కాల్పుల ఘటనతో న్యూజిలాండ్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాల్పుల నుంచి బంగ్లాదేశ్ క్రికెట్‌ టీం సురక్షితంగా బయటపడింది. అనంతరం కాల్పులపై బంగ్లా క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. దుండగుల కాల్పుల నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ టీం సురక్షితంగా బయటపడ్డారని ట్వీట్‌ చేశారు.

డీన్స్ ఏవ్ మసీదులో ప్రార్థనలు చేస్తుండగా కాల్పులు శబ్దం విన్న  తర్వాత బయటకు వచ్చి చూస్తే నా భార్య ఫుట్ పాత్ పై రక్తపు మడుగులో పడి ఉందని ఓ  ప్రత్యక్ష సాక్షి తెలపగా.. చిన్నారులపై  కాల్పులు జరుపుతుండగా చూశానని మరో వ్యక్తి తెలిపారు. కాల్పుల ఘటనా స్థలంలో ఉన్న మరో వ్యక్తి రేడియో స్టేషన్ కు ఫోన్ చేసి.. తాను కాల్పుల శబ్దం విన్న  వ్యక్తి.. పలువురు రక్తపు మడుగులో ఉన్నారని సమాచారమిచ్చాడు.  
Read Also: కాల్పుల కలకలం : బంగ్లా క్రికెటర్లకు తప్పిన ప్రమాదం

Masjid
firing
incident
Responding
PM
Jacinda Arned
new zealand
Christ Church
Al Noor

మరిన్ని వార్తలు