మారుతీ కస్టమర్లకు షాక్ : 63,493 మారుతీ కార్లు రీకాల్ 

Submitted on 7 December 2019
Maruti Suzuki Recalls 63,493 Cars With The Smart Hybrid System In India

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 63,493 యూనిట్ల పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ కార్లను రీకాల్ చేసింది. సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 మోడళ్లలో మోటార్ జనరేటర్ యూనిట్‌ను సరిచేయటం కోసం వీటిని వెనక్కి పిలిపిస్తున్నట్లు సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింది.

జనవరి 1, 2019 నుంచి నవంబర్ 21, 2019 లోపు తయారైన ఈ కార్లలో జనరేటర్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు గుర్తించినట్లు, వీటిని పరిశీలించి ఉచితంగా మరమ్మత్తు చేసి ఇవ్వనున్నట్లు పేర్కొంది.  విదేశీ గ్లోబల్ పార్ట్ సప్లయర్ తయారీ సమయంలో ఎంజియులో డిఫెక్ట్ వచ్చాయని సంస్ధ గుర్తించింది.

india
Maruti Suzuki
Maruti
ertiga
ciaz

మరిన్ని వార్తలు